🅰🅿 టెట్–2021 విధానం, సిలబస్ ఖరారు విడుదల చేసిన మంత్రి ఆదిమూలపు సురేష్
అమరావతి:
రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి అభ్యర్థులకు ముందుగా నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)–2021 పేపర్ల విధి విధానాలు, సిలబస్‌ను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం విడుదల చేశారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సిలబస్‌ను https://aptet.apcfss.in లో అందుబాటులో ఉంచామని మంత్రి సురేష్ తెలిపారు. రాష్ట్రంలో టెట్ నిర్వహణపై ప్రభుత్వం మార్చి 17న జీవో 23 ద్వారా మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
టెట్‌కు సంబంధించిన ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి..
టెట్ లో రెండు పేపర్లు..
• టెట్‌లో 2 పేపర్లు (పేపర్–1, పేపర్–2) ఉంటాయి.
పేపర్ 1–ఏ, 1–బీ, 2–ఏ, 2–బీ లుగా వీటిని నిర్వహిస్తారు.
రెగ్యులర్ స్కూళ్లలో 1–5 తరగతుల టీచర్ పోస్టులకు పేపర్ 1–ఏ లో అర్హత సాధించాలి.
దివ్యాంగులు, ఇతర విభిన్న ప్రతిభావంతులు స్పెషల్ స్కూల్స్‌లో 1–5 తరగతులు బోధించాలంటే పేపర్ 1–బీలో అర్హత తప్పనిసరి.
రెగ్యులర్ స్కూళ్లలో 6–8, ఆ పై తరగతులు బోధించాలంటే పేపర్ 2–ఏలో అర్హత సాధించాలి
DEAR FRIENDS.. SETTING ARE CHANGED..PLEASE CHECK AND GET INFO
ReplyDelete