Tuesday, April 19, 2022

Instructions in Telugu to CSs, MEOs, DOs, Invigilators & Other Staff and Registers

SSC PUBLIC EXAMS 2022 CS కి అవసరమయ్యే వివిధ రకాల ఫారాలు, రిజిస్టర్లు మరియు MEOs, CSs, DOs,  Invigilators మరియు Other Staff పాటించ వలసిన సూచనలు..

                           



CLICK HERE 

                  

TELUGU VERSION 👇

CLICK HERE


FINAL SSC INSTRUCTIONS
   👇

 CLICK HERE


Monday, April 18, 2022

Flash.. School wise SSC Hall Tickets & NR Released April - 2022

 Flash.. School wise SSC Hall Tickets & NR Released April - 2022  

పాఠశాలల వారీగా పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు 2022  హాల్ టికెట్స్ మరియు నామినల్ రోల్స్ విడుదల

          


CLICK HERE

Proceedings 👇



 


  

Thursday, April 14, 2022

🅰🅿 పదవ తరగతి రాయబోయే విద్యార్థులకు పరీక్షా సమయంలో పాటించ వలసిన సూచనలు

 🅰🅿  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం:

పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం వారు సూచనలను జారీ చేయడమైనది. 

 తేదీ 27-04-2022 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే పదవ తరగతి పరీక్షలలో పాల్గొనే విద్యార్థులందరూ పాటించ వలసిన సూచనలు తెలియ జేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన గౌరవనీయ డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, ఆంధ్రప్రదేశ్.. (తెలుగులో)






 




AMINA CHARANIA : AUTHENTIC AND CONTEXTUAL LEARNING WITH ICT


 AMINA CHARANIA : AUTHENTIC AND CONTEXTUAL LEARNING WITH ICT
     CLICK HERE

                               

 

TPACK is where the technology, content and pedagogy knowledge areas support each other to facilitate teaching and learning.


       
  

Tuesday, April 5, 2022

Rc.No.ESE02/290/2022, Duties of HMs and MEOs

విద్యాశాఖలో అకడమిక్ మరియు అడ్మినిస్ట్రేషన్ లలో సమూల మార్పులు కోసం, ఉపాధ్యాయుల, ప్రధానోపాధ్యాయుల , ఏంఈవోల బాధ్యతల పై సమగ్ర ఉత్తర్వులు Rc.No.ESE02/290/2022 విడుదల చేసిన పాఠశాల విద్యా శాఖా కమిషనర్        


CLICK HERE FOR DOWNLOAD

పాఠ్య ప్రణాళికలు రాసే విధానంలో మార్పులు, ఉపాధ్యాయుల పాత్ర , ప్రధానోపాధ్యాయుల పాత్ర , మానిటరింగ్ ఆఫీసర్ ల బాధ్యతలు స్పష్ట పరుస్తూ ఉత్తర్వులు విడుదల


*🅰🅿 LESSON PLANS ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కొత్తవి వ్రాయాలని మరియు ఇతర పాఠశాల/తరగతి నిర్వహణ పై విద్యా శాఖ కమీషనర్ గారి ఉత్తర్వులు తెలుగులో*

             Download in Telugu







Sunday, April 3, 2022

ఆంధ్రప్రదేశ్-జిల్లాల విభజన, 26 జిల్లాలతో రాజ పత్రము

 

ఆంధ్రప్రదేశ్-జిల్లాల విభజన, 26 జిల్లాలతో రాజ పత్రము

గెజిట్ డౌన్లోడ్ చేసుకోవడానికి క్లిక్ చేయండి



           DOWNLOAD 


🅰️🅿️ఏపీలో కొత్త జిల్లాల ప్రక్రియ పూర్తి, చిన్న చిన్న మార్పులకు ఆమోదం తెలిపిన కేబినెట్ 

26 జిల్లాలు, 73 రెవెన్యూ డివిజన్లతో ఫైనల్‌ గెజిట్‌ సిద్దమైంది.

అటు పలు మండలాలను ప్రభుత్వం మార్చింది.

రెవెన్యూ డివిజన్ల సంఖ్య 51 నుంచి 73 కి పెరిగింది.

పాత రెవెన్యూ డివిజన్‌లన్నీ యథాతథంగా కొనసాగనున్నాయి.

కొత్త జిల్లాల వారీగా రెవెన్యూ డివిజన్లు, మండలాల సంఖ్య

1. శ్రీకాకుళం జిల్లా : పలాస (కొత్త), టెక్కలి, శ్రీకాకుళం(30 మండలాలు)

2విజయనగరం : బొబ్బిలి (కొత్త), చీపురుపల్లి (కొత్త), విజయనగరం (27 మండలాలు)

3ప్వార్వతీపురం మన్యం : పార్వతీపురం, పాలకొండ (15 మండలాలు)

4అల్లూరి సీతారామరాజు : పాడేరు, రంపచోడవరం(22 మండలాలు )

5విశాఖపట్నం : భీమునిపట్నం (కొత్త), విశాఖపట్నం(11 మండలాలు)

6. అనకాపల్లి : అనకాపల్లి, నర్సీపట్నం (24 మండలాలు)

7కాకినాడ : పెద్దాపురం, కాకినాడ (21 మండలాలు)

8కోనసీమ : రామచంద్రాపురం, అమలాపురం, కొత్తపేట (కొత్త) (22 మండలాలు)

9తూర్పుగోదావరి : రాజమహేంద్రవరం, కొవ్వూరు (19 మండలాలు)

10పశ్చిమగోదావరి : నర్సాపురం, భీమవరం (కొత్త)(19 మండలాలు)

11ఏలూరు : జంగారెడ్డిగూడెం, ఏలూరు, నూజివీడు(28 మండలాలు)

12కృష్ణా : గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు (కొత్త)(25 మండలాలు)

13ఎన్టీఆర్‌ : విజయవాడ, తిరువూరు (కొత్త), నందిగామ (కొత్త)(20 మండలాలు)

14గుంటూరు : గుంటూరు, తెనాలి(18 మండలాలు)

15బాపట్ల : బాపట్ల (కొత్త), చీరాల (కొత్త)(25 మండలాలు)

16పల్నాడు : గురజాల, నర్సరావుపేట, సత్తెనపల్లి (కొత్త)(28 మండలాలు)

17ప్రకాశం : మార్కాపురం, ఒంగోలు, కనిగిరి (కొత్త)(38 మండలాలు)

18నెల్లూరు : కందుకూరు, కావలి, ఆత్మకూరు, నెల్లూరు(38 మండలాలు)

19కర్నూలు : కర్నూలు, ఆదోని, పత్తికొండ (కొత్త)(26 మండలాలు)

20నంద్యాల : ఆత్మకూరు (కొత్త), డోన్‌ (కొత్త), నంద్యాల(29 మండలాలు)

21అనంతపురం : అనంతపురం, కళ్యాణదుర్గం, గుంతకల్‌ (కొత్త)(31 మండలాలు)

22శ్రీ సత్యసాయి : ధర్మవరం, పెనుకొండ, కదిరి, పుట్టపర్తి (కొత్త)(32 మండలాలు)

23. వైఎస్సార్‌ కడప : బద్వేల్, కడప, జమ్మలమడుగు(36 మండలాలు)

24అన్నమయ్య : రాజంపేట, మదనపల్లె, రాయచోటి (కొత్త)(30 మండలాలు)

25చిత్తూరు : చిత్తూరు, నగరి (కొత్త), పలమనేరు (కొత్త), కుప్పం (కొత్త)(31 మండలాలు)

26తిరుపతి : గూడూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి (కొత్త), తిరుపతి.(34 మండలాలు)

 కొత్త జిల్లాల్లో 5 ఆసక్తికర అంశాలు : 

       జిల్లా అని తెలుగులో, డిస్ట్రిక్ట్ అని ఇంగ్లీషులో పలికే ఈ పదానికి పరిపాలనకు అనుగుణంగా నిర్దేశించిన ప్రాదేశిక భూభాగం అని అర్థం. జిల్లా అనే పదం పర్షియన్, ఉర్దూ భాషల నుంచి వచ్చింది. దాని అర్థం విభజన అని. జిల్లాలు పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటయ్యాయి. జిల్లాలను తిరిగి మండలాలు, గ్రామాలు, వార్డులుగా విభజిస్తారు.

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల విభజనకు సంబంధించిన ఐదు ఆసక్తికర అంశాలను ఇక్కడ చూద్దాం.

 1) అత్యంత చిన్న జిల్లా 

  2014లో ఆంధ్రప్రదేశ్‌ విభజనకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలు ఉండేవి. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో 13 జిల్లాలున్నాయి. ఇందులో ప్రకాశం, విజయనగరం తప్ప అన్ని జిల్లాలూ బ్రిటిష్ హయాంలో ఏర్పడ్డవే. పరిపాలనా సౌలభ్యం కోసం గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల నుంచి కొన్ని ప్రాంతాలతో 1970లో ప్రకాశం జిల్లా ఆవిర్భవించగా, 1979లో విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలతో విజయనగరం జిల్లా ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటివరకు విజయనగరం అత్యంత చిన్న జిల్లాగా ఉండగా, ఇప్పుడు జిల్లాల విభజనతో ఆ స్థానంలోకి విశాఖపట్నం వచ్చింది.

 2) గ్రామీణ ప్రాంతమే లేని జిల్లా 

జిల్లాల విభజన తర్వాత- విస్తీర్ణం ప్రకారం చూస్తే 14,322 చ.కి.మీ. విస్తీర్ణంతో ఏపీలో పెద్ద జిల్లాగా ప్రకాశం, 928 చ.కి.మీ. విస్తీర్ణంతో విశాఖపట్నం చిన్న జిల్లాగా అవతరించాయి. జనాభా పరంగా చూస్తే 23.66 లక్షల జనాభాతో కర్నూలు మొదటి స్థానంలో ఉంది.

జిల్లాల విభజన తర్వాత- విశాఖపట్నం జిల్లా జనాభా 18.13 ల‌క్ష‌లు. ఈ జిల్లాలో అసలు గ్రామీణ ప్రాంతమే లేదు. విశాఖపట్నం జిల్లాలోని నగర ప్రాంతాన్ని విశాఖపట్నం జిల్లాగా, గ్రామీణ ప్రాంతాన్ని అనకాపల్లి జిల్లా, ఏజెన్సీ ప్రాంతాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాగా విభజించారు. రాష్ట్రంలో అతి తక్కువ జనాభా ఉన్న జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా. కొత్తగా ఏర్పడిన ఈ జిల్లా జనాభా 9.54 లక్షలు.

  3) గిరిజన జిల్లాలు ఏవేవి? 

విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు, కర్నూలు, ఉభయ గోదావరి జిల్లాల్లో గిరిజన ప్రాంతాలున్నాయి. గిరిజన సంక్షేమం కోసం ఈ జిల్లాల్లో ఎనిమిది ఐటీడీఏలు (సమీకృత గిరిజన అభివృద్ధి ఏజెన్సీలు) ఉన్నాయి. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో గిరిజనుల కోసం ప్రత్యేకంగా జిల్లాలు లేవు. ఇప్పుడు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల పేర్లతో రెండు గిరిజన జిల్లాలు ఏర్పడ్డాయి. వీటిని గిరిజనుల కోసం ఏర్పాటు చేస్తున్న జిల్లాలుగా ప్రభుత్వం చెబుతోంది. ఈ రెండు జిల్లాల్లో అత్యధికులు గిరిజనులే. పార్వతీపురం మన్యం జిల్లా పేరును తొలి నోటిఫికేషన్‌లో మన్యం జిల్లాగా ప్రభుత్వం ప్రకటించగా, దానిపై ఆందోళన జరగడంతో పార్వతీపురం మన్యం జిల్లాగా మార్చింది.

4) సముద్ర తీరం ఉన్న రాయలసీమ జిల్లా ఏది? 

     జిల్లాల విభజనతో రాయలసీమ ప్రాంత భౌగోళిక స్వరూపంలో ఒక ఆసక్తికర మార్పు వచ్చింది. ఇప్పటివరకు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్న తొమ్మిది జిల్లాలే తీర ప్రాంత జిల్లాలు. వీటినే కోస్తా జిల్లాలంటారు. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో దేనికీ సముద్రతీరం లేదు. రాయలసీమలోని నాలుగు జిల్లాలు ఇప్పుడు ఎనిమిది జిల్లాలవుతున్నాయి. అందులో ఒకటైన తిరుపతి జిల్లాకు ప్రస్తుత నెల్లూరు జిల్లాలోని తీరప్రాంతం కలిగిన సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని కలిపారు. దీంతో తిరుపతి జిల్లా పరిధిలోకి సముద్ర తీరం వచ్చింది. సూళ్లూరుపేట తో పాటుగా సముద్రతీరంలో ఉన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం కూడా తిరుపతి జిల్లాలో కలుస్తోంది.

5) వ్యక్తుల పేర్లతో ఉన్న జిల్లాలెన్ని? 

ఇప్పటివరకు రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో ప్రకాశం, పొట్టి శ్రీరాములు, వైఎస్సార్ జిల్లాలు వ్యక్తుల పేర్లతో ఉన్నాయి. ఇప్పుడు జిల్లాల విభజనలో- స్థానికంగా వచ్చిన డిమాండ్లతో వ్యక్తుల పేర్లతో మరికొన్ని జిల్లాలు వచ్చాయి.

రాష్ట్రంలో వ్యక్తుల పేరుతో ఏర్పడిన మొదటి జిల్లా ప్రకాశం. స్వాతంత్ర సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశంపంతులు సేవలను గుర్తిస్తూ 1972లో ఒంగోలు జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చారు. ఆమరణ నిరాహార దీక్షతో ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించిన పొట్టి శ్రీరాములు పేరును 2008 లో నెల్లూరు జిల్లాకు పెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును 2010లో కడప జిల్లాకు పెట్టారు.

తూర్పు కనుమల్లోని గిరిజనులకు అండగా నిలిచి బ్రిటిషు వారిని ఎదిరించి మన్యం వీరుడిగా పేరు పొందిన అల్లూరి సీతారామరాజు పేరును ఎప్పటీ నుంచో విశాఖ జిల్లాకు పెట్టాలనే డిమాండ్ ఉంది. అయితే ఇప్పుడు విశాఖ మూడు జిల్లాలుగా విడిపోయింది. అందులో గిరిజనుల కోసం ఏర్పాటు చేసిన జిల్లాను పాడేరు కేంద్రంగా ల్లూరి సీతారామరాజు జిల్లా పేరిట ఏర్పాటు చేశారు.

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్) పేరు విజయవాడ కేంద్రంగా ఏర్పాటైన జిల్లాకు పెట్టారు.

ప్రఖ్యాత వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమయ్య పేరుతో రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా, పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటయ్యాయి.

మొత్తమ్మీద 26 జిల్లాలకుగాను ఏడు జిల్లాలకు వ్యక్తుల పేర్లు ఉన్నాయి.

కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ప్రభుత్వం 2022 జనవరి 26న నోటిఫికేషన్ ఇచ్చింది. జిల్లాల పేర్లు, సరిహద్దులపై సలహాలు, అభ్యంతరాలు ఉంటే నెల రోజుల వ్యవధిలో తెలిపాలని సూచించింది. నెల రోజుల్లో 16,600 సలహాలు, అభ్యంతరాలు వచ్చాయని కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులు తెలిపారు.

వాటికి అనుగుణంగా మార్పులు, చేర్పుల విషయంలో ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి కలెక్టర్లు సమాచారం సేకరించారు. ప్రజల నుంచి వచ్చిన సలహాలు, అభ్యంతరాల మేరకు మన్యం జిల్లా పేరును పార్వతీపురం మన్యం అని, శ్రీ బాలాజీ జిల్లాను తిరుపతి జిల్లాగా మార్చారు. మిగతాదంతా దాదాపు తొలి నోటిఫికేషన్‌లో ఉన్నదే.

కొత్త జిల్లాల్లో సొంత భవనాలకే ప్రాధాన్యం 

కొత్తగా ఏర్పడుతున్న జిల్లాలలోని పరిపాలన భవనాలను ఎంపిక ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. జిల్లా కలెక్టరేట్ సహా పరిపాలనా భవన సముదాయాన్ని ఒకే చోట ఉండేటట్లు, ఆ ప్రాంగణమంతా కనీసం 15 ఎకరాల స్థలం ఉండేలా చూసుకోవాలని సీఎం ఆయా జిల్లా అధికారులకు సూచించారు. పరిపాలన భవనాల కోసం మంచి డిజైన్లు ఎంపిక చేసుకోవాలని కూడా చెప్పారు. సొంత భవనాలు దొరకని చోట తొలుత అద్దె భవనాల్లో పాలన సాగించినా తర్వాత సొంత కొత్త భవనాల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించారు.