Sunday, December 12, 2021

విద్యార్థుల భవితకు నవోదయం 2021-22.

 విద్యార్థుల భవితకు నవోదయం..



ప్రవేశ పరీక్షకు ది. 15.12.2021 లోపు దరఖాస్తు చేసుకోవాలి..

జవహర్‌ నవోదయ విద్యాలయ (జేఎన్‌వీ)లో ఆరో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ జేఎన్‌వీ-2022 ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు ఈ నెల 15వరకు ఆన్‌లైన్‌లో అవకాశం కల్పించింది. హిందీ, ఇంగ్లిషు, తెలుగు మూడు భాషల్లోనూ విద్యార్థుల్లో సామర్థ్యం పెంపు, వలస విద్యా విధానం ద్వారా జాతీయ సమైక్యత పెంపొందించడం జేఎన్‌వీ ముఖ్య ఉద్దేశం. గుంటూరు జిల్లాలో చిలకలూరిపేట మండలం మద్దిరాల, కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వేలేరులో వీటిని ఏర్పాటు చేశారు. ఏటా నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా ఒక్కో విద్యాలయకు 80 మంది విద్యార్థులను ఎంపిక చేస్తారు. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తారు. బాలబాలికలకు వేర్వేరు ఆవాస, వసతి సౌకర్యాలు కల్పించారు.*

దరఖాస్తు ఇలా..

దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 2020-21 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతుండాలి. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 75 శాతం సీట్లు కేటాయించారు. వారు 3, 4, 5 తరగతులు గ్రామీణ ప్రాంత పాఠశాలల్లోనే చదివి ఉండాలి. మిగిలిన 25శాతం సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు. తెలుగు లేదా ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశ పరీక్ష రాయవచ్ఛు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 1.5.2009 నుంచి 30.4.2013 మధ్యలో జన్మించిన వారై ఉండాలి. ప్రవేశపరీక్ష 2022 ఏప్రిల్‌ 30వ తేదీ ఉదయం 11.30 గంటలకు జిల్లాలో ఎంపిక చేసిన అన్ని కేంద్రాలలో నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌లో www.navodaya.gov.in వైబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్ఛు

ప్రవేశ పరీక్ష ఇలా..:

 జవహర్‌ నవోదయ ప్రవేశానికి నిర్వహించే రాత పరీక్షలో వచ్చే మార్కులు ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది. ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రంలో మూడు విభాగాలు ఉంటాయి. మొత్తం 80 ప్రశ్నలు 100 మార్కులకు 2 గంటల సమయంలో ప్రవేశ పరీక్ష ఉంటుంది.

ప్రతిభావంతులకు గొప్ప అవకాశం.

ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు జవహర్‌ నవోదయ విద్యాలయలో సీటు తెచ్చుకోవడం గొప్ప అవకాశం. జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వ తరగతి చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులందరితో ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు దరఖాస్తు చేయించాలి. తల్లిదండ్రులకు విషయం తెలియ జేసి వారితో నైనా దరఖాస్తు చేయించాలి. ప్రతిఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 

 Website link:

www.navodaya.gov.in



No comments:

Post a Comment