Saturday, October 10, 2020

నిష్టా శిక్షణ ఇప్పటివరకు ఉన్న సందేహాలు

నిష్టా శిక్షణ - ఇప్పటి వరకూ ఉన్న సందేహాలు




1 మెడికల్ లీవ్/మేటర్నటీ లీవ్ లో ఉన్నవారు కూడా ట్రైనింగ్ లో పాల్గొనాలా?

2 RCM/ఇతర AIDED/DSC2018 TEACHERS ని కూడా ట్రైనింగ్ పొందబోయే టీచర్స్ లిస్ట్ లో add చేశారా? లిస్టులో లేని aided/DSC 2018 teachers call చేసి వారిని గ్రూప్ లో add చేయమని అడుగే వారి సంగతి ఏమిటి? 

3 చాలా మంది టీచర్స్ కు MY COURSES and MY STATE COURSES అని చూపించడం లేదు. సెర్చ్ బార్ లో AP_విద్య అని టైప్ చేసి సెర్చ్ చేశాక JOIN IN COURSE అని కూడా చూపించడం లేదు. అటువంటి వారు ఏమి చేయాలి? మొదలైన సందేహాలకు సమాధానములు.. 

https://drive.google.com/file/d/1lxkMB68D-t0DEeTQqLXz8H9pEpUG09Ar/view?usp=sharing


*🌹N I S H T H A🌹*


 *మిత్రులారా!*

*📝నిష్టా శిక్షణ ఈ క్రింది విధంగా జరుగుతుంది.🖥👇*


06.10.2020 నుండి 31.01.2021 వరకు నిష్టా శిక్షణ ఉంటుంది


*06.10.2020 నుండి 15.10.2020 మధ్యలో oneday orientation programme టీచర్స్ కు ఉంటుంది.*


*16.10.2020 నుండి 15.01.2021 వరకు నిష్టా శిక్షణ జరుగుతుంది.*


శిక్షణ లో వెనుకబడిన వారికి శిక్షణ పూర్తి చేయుటకు అదనపు సమయం *(16.01.2021 నుండి 31.01.2021 వరకు)* ఇవ్వబడుతుంది.


*📝శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ ఇస్తారు📝.*


*🌹🖥DIKSHA AP official యూట్యూబ్ చానల్ ద్వారా మాత్రమే live class లు చూడాలి.*

 (6pm to 7pm). ఆ సమయంలో వీలుకాని పక్షములో తరువాత ఎప్పుడైనా చూడవచ్చు.


*🌹🖥ఆన్లైన్ క్లాసెస్ ప్రతి రోజు  ఉండవు. క్రింది విధంగా మాత్రమే ఉంటాయి👇.*


*📝ఆన్లైన్ క్లాసులు జరిగే తేదీలు:🖥*


*మాడ్యూల్  -1       

17.10.2020


*మాడ్యూల్-22       

22.10.2020


*మాడ్యూల్స్-3    

27.10.2020


*మాడ్యుల్-4*

02.11.2020


*మాడ్యూల్-5*

07.11.2020


*మాడ్యూల్-6*

12.11.2020


*మాడ్యుల్-7*

17.11.2020


*మాడ్యూల్-8*

22.11.2020


*మాడ్యూల్-9*

27.11.2020


*మాడ్యూల్-10*

02.12.2020


*మాడ్యూల్-11*

07.12.2020


*మాడ్యూల్-12*

12.12.2020


*మాడ్యూల్-13*

17.12.2020


*మాడ్యూల్-14*

22.12.2020


*మాడ్యూల్-15*

27.12.2020


*మాడ్యూల్-16*

02.01.2021


*మాడ్యూల్-17*

07.01.2021


*మాడ్యూల్-18*

   12.01.2021


మిగతా సమయంలో మాడ్యూల్ అధ్యయనం, సంబంధించిన వీడియోలు చూడటం, కృత్యాలు తయారు చేసి సబ్మిట్ (అప్లోడ్)  చేయటం,10 మల్టిఫుల్ ఛాయిస్ ప్రశ్నలు( క్విజ్ )పూర్తి చేయటం ఉంటుంది.

ప్రతి మాడ్యూల్ కి 5 రోజులు సమయం కేటాయించారు., SSB(SRG)






Thursday, October 1, 2020

KRISHNA - GUNTUR జిల్లాల శాసన మండలి ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్లు ఓటు రిజిస్టర్ చేసికొనుటకు ఆన్లైన్ లింక్

🅰🅿

నేటి నుంచి KRISHNA - GUNTUR జిల్లాల శాసన మండలి ఓటర్ల నమోదు




కృష్ణా - గుంటూరు జిల్లాల శాసన మండలి ఉపాధ్యాయు నియోజక వర్గ ఓటర్ల నమోదు అక్టోబర్ 1  నుండి ప్రారంభం అవుతుంది. 

ఆన్లైన్ నమోదు చేసుకొనుటకు క్రింది లింక్

https://ceoaperolls.ap.gov.in/ap_mlc_2020/online/form19.aspx

 గత ఓటరు జాబితాలో పేరు ఉన్నా, ప్రస్తుతం నమోదు చేసుకోవాలి. 

SCHEDULE

ఓటర్ల నమోదు ప్రకటన జారీ   -  October 1

నమోదు స్వీకరణ తొలి పునః ప్రకటన జారీ - October15

నమోదు స్వీకరణ మలి పునః ప్రకటన జారీ - October 25

దరఖాస్తుల స్వీకరణ ఆఖరు తేదీ - November 6

ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ  -  December 1

అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణకు గడువు - Dec 1 to 31 Dec. 

అభ్యంతరాలు, ఫిర్యాదుల పరిష్కారం - 2021 January, 12.

తుది ఓటర్ల జాబితా ప్రచురణ  - 2021 January 18న.



Sunday, September 27, 2020

SAMAGRA SIKSHA EK BHARAT SRESTA BHARAT

 🅰🅿 AP సమగ్ర శిక్ష... ఏక్ భారత్.. శ్రేష్ట్ భారత్ (EBSB) క్రింద దేశంలోని రాష్ట్రాలు / UT లను 16 జతలుగా చేసి (ఆంధ్రప్రదేశ్ మరియు పంజాబ్ జత చేయ బడినవి) డిజిటల్ మోడ్ (దూరదర్శన్ సప్తగిరి ఛానెల్ ) ద్వారా EBSB కార్యక్రమాలను నిర్వహించడం, 

దీక్ష యాప్ ద్వారా విద్యా సామాగ్రి పొందుట, 

పాఠశాల కృత్యాలతో EBSB కృత్యాలను సమ్మిళితం చేయుట...

 తదితర అంశాలను పాఠశాలల్లో నిర్వహించేలా అన్ని ప్రైమరీ, సెకండరీ పాఠశాలల HM లకు సూచించాలనీ

సదరు అంశాల  నిర్వహణ తాలూకూ ఫోటో /  వీడియోలను  గూగుల్ డ్రైవ్ లో upload చేసి వాటిని APSS కార్యాలయానికి కూడా పంపవలసిందిగా అందరు DEO లను , APC SS లను కోరుతూ  APSS పథక సంచాలకులు శ్రీమతి కే వెట్రిసెల్వి గారు

 మెమో జారీ చేసారు.


Monday, July 20, 2020

'నాడు-నేడు’ పనుల్లో రాజీపడొద్దు- జగనన్న గోరుముద్ద’ - విద్యా సంవత్సరం సెప్టెంబర్ అయిదో తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశముందని మంత్రి స్పష్టం...

'నాడు-నేడు’ పనుల్లో రాజీపడొద్దు- జగనన్న గోరుముద్ద’ - విద్యా సంవత్సరం సెప్టెంబర్ అయిదో తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశముందని మంత్రి స్పష్టం...

‘నాడు-నేడు’ పనుల్లో రాజీపడొద్దు
 రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశం
 ‘నాడు-నేడు’లో విశాఖ టాప్
 విద్యార్థులకు రుచికరమైన ‘జగనన్న గోరుముద్ద’ అందివ్వాలి...
 ఆగస్టు మొదటి వారానికి డెమో స్కూల్స్ సిద్ధం చేయండి..
 25 నుంచి ఫర్నీచర్, ఫ్యాన్లు, శానిటరీ తదితర మెటీరియల్స్ పంపిణీ
 పాఠశాలల పున: ప్రారంభానికి ముందే పాఠ్య పుస్తకాలు అందజేయండి : మంత్రి ఆదిమూలపు సురేష్
సచివాలయం, జులై 20 : నాడు – నేడు పథకంలో భాగంగా పాఠశాలల అభివృద్ధి పనుల్లో నాణ్యతపై రాజీపడొద్దని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. ఈ నెల 25వ తేదీ నుంచి రాష్ట్రంలో అన్ని పాఠశాలలకూ ఫర్నీచర్, ఫ్యాన్లు, శానిటరీ తదితర మెటీరియల్స్ పంపిణీ ప్రారంభించాలని ఆదేశించారు. నూతన విద్యా సంవత్సరం సెప్టెంబర్ అయిదో తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశముందని, ఆలోగా 7 నుంచి 10 తరగతి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలన్నారు. సచివాలయం నాలుగో బ్లాక్ లోని తన కార్యాలయంలో నాడు – నేడు పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల ప్రగతిని సంబంధిత అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. పనుల నాణ్యతల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడొద్దని ఆదేశించారు.  క్వాలిటీ కంట్రోల్ బృందాలు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తుండాలన్నారు. ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ ద్వారా చేపడుతున్న పనులను అదే డిపార్టుమెంట్లకు చెందిన క్వాలిటీ కంట్రోల్ బృందాలతో పర్యవేక్షించేటట్లు చూడాలని విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ ను మంత్రి ఆదేశించారు. మరుగుదొడ్లు, సురక్షితమైన తాగునీటి సరఫరా తదితర మౌలిక సదుపాయల అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. తాగునీటి సరఫరాలో భాగంగా పాఠశాలలో ఏర్పాటు చేసే ఆర్వో ప్లాంట్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
నిధుల పంపిణీలో ఆలసత్వం వద్దు...
పూర్తి స్థాయిలో సిమ్మెంట్ పంపిణీ కాకపోవడంతో అభివృద్ధి పనుల్లో ఆలస్యం చోటుచేసుకుంటోందని మంత్రి దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. 17 కంపెనీల నుంచి 17 వేల టన్నులకు పైగా సిమ్మెంట్ రావాల్సి ఉందన్నారు. విద్యా శాఖలో నాడు – నేడు పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తోందని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కావాల్సినన్ని నిధులు పుష్కలంగా ఉన్నాయని, సిమ్మెంట్ పరిశ్రమలకు తక్షణమే బకాయిలు చెల్లంచాలని మంత్రి ఆదేశించారు. సిమ్మెంట్ కంపెనీలకు విద్యా శాఖ ఎటువంటి బకాయిలూ లేవని, ఇతర శాఖలు బిల్లులు చెల్లించకపోవడంతో పాఠశాలల అభివృద్ధి పనులకు సంబంధిత కంపెనీలు సిమ్మెంట్ సరఫరా పూర్తిస్థాయిలో చేయడం లేదని మంత్రి దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. ఈ విషయం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళతానని మంత్రి తెలిపారు. పనులు కొసాగడానికి పేరెంట్స్ కమిటీలకు రివ్వాల్వింగ్ ఫండ్ తక్షణమే అందజేయాలని ఆదేశించారు. విశాఖ జిల్లాలోని గిడిజాల గ్రామంలోని పాఠశాలలో చేపట్టిన పనులపై మంత్రి సంతృప్తి వ్యక్తంచేశారు.
25 నుంచి మెటీరియల్స్ పంపిణీ చేయండి....
ఆగస్టు మొదటి వారానికి రాష్ట్రంలో గుర్తించిన 30 డెమో స్కూల్స్ లో నాడు – నేడు పనులు పూర్తిచేసి సిద్ధం చేయాలని మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశించారు. దీనిలో భాగంగా  ఈ నెల 25వ తేదీ నుంచి రాష్ట్రంలో అన్ని పాఠశాలలకూ ఫర్నీచర్, ఫ్యాన్లు, శానిటరీ తదితర మెటీరియల్స్ పంపిణీ ప్రారంభించాలని మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశించారు. మిగిలిన పాఠశాలలకూ పనుల ప్రగతిని బట్టి మెటీరియల్స్ ను పంపిణీ చేయాలన్నారు. ఇందుకోసం డెలివరీ షెడ్యూల్స్ ను రూపొందించాలన్నారు.
పాఠశాలల పున: ప్రారంభానికి ముందే పాఠ్య పుస్తకాలు
కొవిడ్-19 నిబంధనలను అనుసరించి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకనుగుణంగా సెప్టెంబర్ అయిదో తేదీ నుంచి పాఠశాలల పున: ప్రారంభించే అవకాశముందని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఆలోగా పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు అందజేసేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ముందుగా 7 నుంచి పదో తరగతి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందజేసేలా చూడాలన్నారు. ముందుగా పాఠ్య పుస్తకాలు అందజేయడం వల్ల విద్యార్థులు వాటిని చదువుకునే అవకాశముందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నాడు-నేడు పథకంలో భాగంగా ఏయే పాఠశాలల్లో గ్రానైట్, టైల్స్, మార్బుల్స్ తో గ్రౌండ్ ఫ్లోర్ వేశారో వాటి వివరాలు అందజేయాలని అధికారులను మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశించారు.
‘నాడు-నేడు’లో విశాఖ ముందంజ....
రాష్ట్రం వ్యాప్తంగా ఈ నెల 19వ తేదీ వరకూ విద్యా శాఖలో రూ.972.68 కోట్లు నాడు-నేడు పథకం కింద వెచ్చించినట్లు మంత్రికి అధికారులు వివరించారు. 13 జిల్లాల వారీగా పరిశీలిస్తే, విశాఖ జిల్లా ముందంజలో ఉన్నట్లు తెలిపారు. 98.33 కోట్లు వెచ్చించి 51.76 శాతం మేర విశాఖలో నాడు-నేడు పనులు చేపట్టినట్లు వెల్లడించారు. గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలు రెండు మూడు స్థానాల్లో ఉన్నాయన్నారు. కృష్ణా జిల్లాలో అత్యల్ప పనులు జరిగినట్లు మంత్రి దృష్టికి అధికారులు తీసుకొచ్చారు.
రుచికరంగా జగనన్న గోరుముద్ద ...
పాఠ్యాంశాల్లో సందేహాల నివృత్తికి ప్రారంభించిన స్టూడెంట్ హెల్ప్ లైన్ కు విశేషమైన స్పందన లభిస్తున్నట్లు మంత్రికి అధికారులు వివరించారు. కొవిడ్ నేపథ్యంలో గత నెల 27 నుంచి  ప్రారంభమైన స్టూడెంట్ హెల్ప్ లైన్ ద్వారా 240 మంది ఉపాధ్యాయులు...విద్యార్థుల సందేహాలకు పరిష్కారం చూపుతున్నారన్నారు. మధ్యాహ్న భోజనం జగనన్న గోరుముద్దపై విద్యాశాఖాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశించారు. నాణ్యత ప్రమాణాలతో కూడిన భోజనాన్ని విద్యార్థులకు అందివ్వాలన్నారు. నాణ్యమైన విద్య,  జగనన్న గోరుముద్ద పథకం అమలుతీరుపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారన్నారు. బ్రిడ్జి కోర్సుల నిర్వహణ, అభ్యాస మొబైల్ అప్లికేషన్, పాఠ్య పుస్తకాల ముద్రణ తదితర అంశాలపైనా సీఎం సమీక్షిస్తారన్నారు. విద్యార్థులకు నాణ్యమైన అందించడమే కాకుండా రుచికరమైన భోజనం అందివ్వాలన్నది సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు. ఇందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, పలువురు విద్యా, పంచాయితీ రాజ్ శాఖాధికారులు పాల్గొన్నారు.




NISHTHA Inauguration Programme

 NISHTHA Inauguration Programme which was Telecast on 17.07.2020





https://youtu.be/CqOHV4alfVI

నిష్ఠ ఆన్లైన్ శిక్షణ ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభమైన వీడియో ఇది.... తప్పకుండా పూర్తింగా వీక్షించి అవగాహన పొందండి.. 
భారత ప్రభుత్వ మానవ వనరుల శాఖామాత్యులు శ్రీ రమేష్ చంద్ర పోక్రియాల్ గారి సందేశంతో పాటు
గౌరవ మానవ వనరుల స్టేట్ మినిస్టర్ శ్రీ సంజయ్ దోత్రే గారు ఇచ్చిన విలువైన సందేశం తో పాటు మన ప్రియతమ విద్యాశాఖామాత్యులు శ్రీ ఆదిమూలపు సురేష్ గారి విలువైన సందేశం...
మరియు మన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ బుడితి రాజశేఖర్ సర్ మన రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యా కార్యక్రమాలతో పాటు నిష్ఠ ఆన్లైన్ శిక్షణ ప్రాధాన్యతను వివరించిన తీరు
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయులందరికీ స్ఫూర్తి దాయకం

అలాగే NCERT Director శ్రీ హృషీకేస్ సేనాపతి గారు
NIEUPEA vice chanceller sri  Varghes గారు నిష్ఠ ఆన్లైన్ శిక్షణ అభివృద్ధి చేసిన విధివిధానాల సవిరంగా వివరించిన తీరు ఈ  యూట్యూబ్ వీడియో వీక్షిస్తే మీకే అర్థమవుతుంది
NCERT టీచర్ ఎడ్యుకేషన్ హెడ్ శ్రీమతి రంజనా అరోరా మేడమ్ నిష్ఠ 18 మాడ్యూళ్లు గురించి శిక్షణ లో వినియోగించాల్సిన విధివిధానాల గురించి చాల స్పష్టంగా వివరించారు
       ఆంధ్రప్రదేశ్ లో ఆన్లైన్లో  ప్రారంభమైన ఈ నేషనల్ ఇనీషియేటివ్ గురించి 1200 మంది KRP లు తప్పని సరిగా వీక్షించి సమగ్ర అవగాహన పొందండి
   త్వరలో మీరు pre training అసెస్మెంట్ సర్వేకు సిద్దంగా ఉండండి
దీన్ని మీరు ఆన్లైన్లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది
           ఆలాగే మీ అందరికీ ఒక వినతి
    కొందరు ఉపాధ్యాయులు తెలుగు అనువాదం  తెలంగాణ మాడ్యూళ్లు వాట్సప్ గ్రూపులలో పోస్ట్ చేస్తున్నారు
   మన రాష్ట్రం నిపుణులు అనువదించిన మాడ్యూల్స్ త్వరలో మన సమగ్రశిక్షా SCERT అప్లోడ్ త్వరలో చేస్తుంది
ఇంగ్లీషు మాడ్యూల్స్ NCERT తయారు చేసిన వాటిని మన రాష్ట్రంలో విషయనిపుణులు అనువదించి అప్లోడ్ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచుతుంది
    ఈ మాడ్యూల్స్ నిష్ఠ వెబ్సైట్ లోనూ మొబైల్ యాప్ లో కూడ అందుబాటుకి
అలాగే ప్రీ ట్రై నింగ్ సర్వే ఫార్మ్ కూడ అందుబాటులోకి వస్తుంది
  మొదటి సోపానంగా KRP. లందరూ ప్రీ ట్రైనింగ్ సర్వే form ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది  ముందు సమయం కేటాయించి ఈ యూట్యూబ్ చానెల్ వీక్షిస్తే మీకు చాల సందేహాలు తీరుతాయి
  ఈ మెగా ఆన్లైన్ టీచర్ ట్రైనింగ్ లాంచ్ కావడాన్ని పటిష్ట ప్రణాళిక తయారు చేసిన  మన పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి శ్రీ బుడితి రాజశేఖర్ సర్ కు మన గౌరవ కమిషనర్ సర్
శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు సర్ కు
SCERT Director Dr Bandla prathapa Reddy sirకు
SIEMAT అధ్యాపకులు Dr Sateesh Reddy గారికి
SCERT Faculty NISTHA co ordinator SMT padmaja gariki
సాంకేతక సహకారాన్ని అందిస్తున్న SCERT డిజిటల్ Edn Head శ్రీ పోకూరి శ్రీనివాస్ రావుగారి
SCERT Digital edn faculty శ్రీ మహమ్మద్ ఇస్మాయిలల్ గారికి
వందనాలతో
గుడిపాటి నారాయణ పూర్వబాధ్య ప్రధానాచార్యులు డైట్ రాయచోటి కడపజిల్లా

Saturday, July 18, 2020

నిష్టా సమాచారము

 నిష్టా - KRP లు అందరూ సంయమనం పాటిస్తూ ముందుగా లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ అయ్యారు, తర్వాత ప్రక్రియ pre Training Test Survey కొరకు వేచి ఉండండి.
అన్ని విషయాలు National Resource Group Experts ద్వారా అందుకో బోతున్నారు. జాతీయ స్థాయి విషయ నిపుణులు తయారు చేసిన మాడ్యూల్స్ ఇవీ





 Generic modules

1.curriculum - learner centred pedogogy - learning outcomes-
Inclusive Education
విద్యాప్రణాళిక, అభ్యాసి కేంద్రీకృత బోధన, అభ్యసన ఫలితాలు, సహిత/సమ్మిళిత విద్య

2.Devoloping social and personal qualities and creating safe and Healthy Environment
సాంఘిక మరియు వ్యక్తిగత గుణాలు పెంపొందించుట - పాఠశాలభద్రత-ఆరోగ్యకర వాతావరణ సృష్టి

3.Art integrated learning
కళ అనుసంధానిత అభ్యసనం

4. School Based Assessment
పాఠశాల ఆధారిత మదింపు

5.Health and well Being in schools
పాఠశాలల్లో ఆరోగ్యం మరియు శ్రేయస్సు

6.Integration of ICT in Teaching learning and Evaluation
బోధన-అభ్యసనం-మదింపులలో సమాచార సాంకేతికత అనుసంధానం

7. Initiatives in School Education
పాఠశాల విద్యలో పథకాలు కార్రక్రమాలు
  Pedogogy modules
బోధనా విధానాల మాడ్యూళ్లు 5

8 pedogogy of Environmental studies
ప్రాథమిక స్థాయిలో పరిసరాల విజ్ఞానం బోధన

9. Pedogogy of Mathematics
గణితశాస్త్ర బోధన

10 pedogogy of languages
భాషలబోధన

11.ఎలిమెంటరీ స్థాయిలో విజ్ఞానశాస్త్ర బోధన

12 pedogogy of social sciences
సాంఘికశాస్త్రం బోధన పద్ధతులు

   ఈ 12 మాడ్యూళ్లు ఆయా సబ్జక్ట్ ఉపాధ్యాయు ల శిక్షణకు సంబంధించినవి
సబ్జెక్టుల KRP లు ప్రాథమిక ఈ మాడ్యూల్స్ పేర్లు తెలుసుకోండి
మీ ప్రీ ట్రైనింగ్ సర్వే తర్వాత మాడ్యూళ్లు ఆంగ్లం తెలుగు మాధ్యమం లో మీరు పొందవచ్చు
Head Masters, Principals, MEO లకు సంబంధించిన లీడర్ షిప్ ప్యాకేజీ

ఐదు మాడ్యూళ్లు కలవు

1.School leader ship concepts and Applications
పాఠశాల నాయకత్వ భావనలు-ఆచరణలు
2.Pre school Education
పూర్వ ప్రాథమిక పాఠశాల విద్య
3.pre vocational Education
పాఠశాలల్లో పూర్వ వృత్తి విద్య
4.బోధనాభ్యసన ప్రక్రియలో లింగభావన-ఔచిత్యం
5.పాఠశాల విద్యలో అభివృద్ధి చర్యలు

  ఈ మాడ్యూళ్ల ద్వారా ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు నిష్ఠ వెబ్సైట్ యాప్ ద్వారా సమాచారం పొందుతూ శిక్షణ పొందుతున్నారు
  ఈ సమూహం ఎప్పటికప్పుడు మీరు శిక్షణ పొందే విధి విధానాలపై సమాచారం అందుబాటులో కి తెచ్చే గ్రూపు కాబట్టి అనవసర విషయాల పోస్టులు పెట్టకుండా నిష్ఠ శిక్షణాంశాలు టెస్టులు వీడియోలు క్విజ్ లలో పాల్గొంటూ National Initiative for school heads and teachers HOLISTIC ADVANCEMENT దిశగా 12 వందల మంది KRP
150 మంది స్కూల్ లీడర్ షిప్ రిసోర్స్ పర్సన్లు సమగ్ర శిక్షణ పొందండి అనవసర పోస్టులు తక్షణం ఆపండి
చదవండి మీరు నిరంతరం మీ వృత్తి నైపుణ్యాలు పెంచుకోండి
వందనాలతో
గుడిపాటి నారాయణ పూర్వబాధ్య ప్రధానాచార్యులు డైట్ రాయచోటి కడపజిల్లా

జగనన్న విద్యాకానుక మార్గదర్శకాలు


వెబ్ సైట్ లో జగనన్న విద్యాకానుకలో భాగంగా HMs Receive చేసుకున్న Belt, Bag, Uniform, Text books వివరాలను క్రింది link లో Login అయ్యి Services లో ఉన్న Stock Received HM మీద click చేసి ప్రధానోపాధ్యాయులు అందరూ వారు Receive చేసుకున్న వివరాలను ENTER చేయాలి.


జగనన్న విద్యాకానుక మార్గదర్శకాలు

సమగ్ర శిక్షా 'జగనన్న విద్యా కానుక' విద్యార్ధులకు కిట్లను క్షేత్ర స్థాయిలో పంపిణీ కొరకు – సమగ్ర శిక్షా సీఎంవోలకు, మండల విద్యాశాఖాధికారులకు విద్యాశాఖ కమీషనర్ మార్గదర్శకాలు జారీచేశారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2020-21 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లోని ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతోన్న అందరు విద్యార్ధులకు సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో 'జగనన్న విద్యా కానుక' పేరుతో స్టూడెంట్ కిట్లను సరఫరా చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

జగనన్న విద్యా కానుక'లో భాగంగా ఒక్కో విద్యార్థికి మూడు జతల యూనిఫాంలు , ఒక సెట్ నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, బ్యాగులను కిట్ రూపంలో అందించవలసి ఉంటుంది.*

నోటు పుస్తకాలకు సంబంధించి:

ఇందులో భాగంగా సప్లయిర్స్ నుంచి మండల రిసోర్సు కార్యాలయాలకు నేరుగా సరుకు అందుతుంది. సరుకు లోడు మండలానికి వచ్చే ముందు సప్లయిర్స్ సంబంధిత సీఎంవో , మండల విద్యాశాఖాధికారికి ఫోన్ ద్వారా సమాచారం అందిస్తారు.

సప్లయిర్స్ ఇచ్చే చలానాలో సంతకం చేసి కార్యాలయ ముద్ర వేయాల్సి ఉంటుంది . తర్వాత ఆ చలానా రాష్ట్ర కార్యాలయానికి సమర్పించాల్సి ఉంటుంది.

అందుకున్న వివిధ సరుకులకు సంబంధించిన వివరాలను మండల విద్యాశాఖాధికారులు వారి లాగిన్ ద్వారా నమోదు చేయవలసి ఉంటుంది.

సప్లయిర్స్ సరఫరా చేసిన సరుకులను భద్రపరచడానికి మండల రిసోర్సు కార్యాలయంలో ఒక వేళ తగినంత స్థలం లేదని భావిస్తే సమీప స్కూల్ కాంప్లెక్సులో లేదంటే దగ్గరలోని భద్రతా ప్రమాణాలు కలిగిన ప్రైవేట్ పాఠశాలలో భద్రపరచాలి.

కిట్ కు సంబంధించిన వస్తువులు అందినవి అందినట్లు మండల విద్యాశాఖాధికారులు , కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారులు నమోదు చేసిన వివరాలను (ఎన్ని వచ్చాయి ఇంకా ఎన్నిఅందాలి?) ఎప్పటికప్పుడు జిల్లా అధికారులు గమనిస్తూ ఉండాలి.

బూట్లుకు సంబంధించి:

బూట్లకు సంబంధించిన ప్యాక్ మీద సైజులు, వాటితో పాటు బాలికలకు సంబంధించినవైతే 'G' అని బాలురకు సంబంధించినవైతే 'B' అని ముద్రించి ఉంటుంది.

ఈ ప్యాకులలో మరిన్ని అవసరమైనా, మిగిలినా, తక్కువైనా ఆ వివరాలను లాగిన్లో నమోదు చేయగలరు.

యూనిఫాం సంబంధించి:

యూనిఫాం కు సంబంధించిన ప్యాక్ కవర్ పైన బాలికలకు సంబంధించినవైతే 'G' అని, బాలురకు సంబంధించినవైతే 'B' అని, దీంతోపాటు తరగతి అంకె ముద్రించి ఉంటుంది.

బ్యాగులకు సంబంధించి:

బ్యాగులు మూడు సైజుల్లో ఉంటాయి. బాలికలకు (స్కై బ్లూ), బాలురకు (నేవీ బ్లూ) రంగులో ఉంటాయి.

1 నుంచి 3 వ తరగతికి చిన్న బ్యాగు.

4-6 వ తరగతికి మీడియం సైజు బ్యాగు.

7-10 వ తరగతికి పెద్ద సైజు బ్యాగు అందించబడుతుంది.

బ్యాగులు అందిన తర్వాత ఈ నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు తదితర వస్తువులన్నీ సెట్లుగా చేసి బ్యాగులో పెట్టించాలి.

ఇవన్నీ పాఠశాలకు చేరేటప్పుడు ఈ బ్యాగు స్కూల్ కిట్ రూపంలో ఉండాలి.

అవసరం మేరకు కార్యాలయ సిబ్బంది సహాయ సహకారాలు తీసుకోవాలి. (వీలుకాని పక్షంలో అవసరం మేరకు కూలీలను పెట్టుకుని బిల్లు పెట్టుకోవచ్చు.)

ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో, నిర్దేశించిన విధంగా విద్యార్ధులకు వెంటనే అంద జేయగలిగే విధంగా సన్నద్ధంగా ఉండాలి.

ప్రతి జిల్లాకు రాష్ట్ర కార్యాలయం నుండి ఒక అధికారిని నియమించడం జరుగుతుంది.

నోటు: ఆరవ తరగతి నుండి నాలుగు రకాల నోటు పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఒక్కో విద్యార్థికి ఒక్కో సెట్ గా తరగతులవారీగా నోటు పుస్తకాలు ఇవ్వాలి . సెట్ల వారీగా ఇవ్వాల్సిన బాధ్యత సప్లయిరుదే. సెట్లుగా చేసిన తర్వాతే వాటిని లాగిన్లో నమోదు చేయాలి.

లాగిన్లలో నమోదు:

జగనన్న విద్యాకానుక' స్టూడెంట్ కిట్ల పంపిణి వివరాల నమోదు మొత్తం schooledu.ap.gov.in లో గల 'స్టూడెంట్ సర్వీసెస్' విభాగంలో ఇచ్చిన లాగిన్ల సహాయంతో పొందుపరచగలరు వివరాలనుhttps://cse.ap.gov.in/DSENEW/
https://ssa.ap.gov.in/SSA/ వెబ్ సైట్ల నందు కూడా పొందుపరచవచ్చు.

సీఎంవోలకు, మండల విద్యాశాఖాధికారులకు ఎలాంటి సందేహాలైన వస్తే నివృత్తి కోసం రాష్ట్ర కార్యాలయ సిబ్బంది డా. ఎస్.వి.లక్ష్మణరావు (70320 91512), శ్రీ డి.సాయి తరుణ్ (995 9950183), శ్రీ జి.ప్రసాద్ రెడ్డి (96769 96528)లను సంప్రదించాలి.






జగనన్న విద్యా కానుకలో భాగంగా MEO OFFICE వారి నుండి తీసుకున్న బెల్ట్, బ్యాగ్, యూనిఫామ్, టెక్స్ట్ బుక్స్ వివరాలను ప్రతి పాఠశాల వారు ఆన్లైన్ లో ఎలా ఎంటర్ చేయాలో పూర్తి వివరాలు తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి

https://youtu.be/PyVcNv 


https://schooledu.ap.gov.in/CHILDINFOSERVICES/logout.htm-uyEg





Friday, July 17, 2020

KVS కేంద్రీయ విద్యాలయ సమితి లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

  KVS కేంద్రీయ విద్యాలయ సమితి లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

కేంద్రీయ విద్యాలయలో 1వ తరగతిలో పిల్లలను చేర్చేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

తల్లిదండ్రులెవరూ పాఠశాలకు రానవసరం లేదని, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.





2020 మార్చి 31 నాటికి ఐదేళ్లు నిండిన చిన్నారులు అర్హులని ఎస్సీలకు 25 శాతం, ఎస్టీలకు 7.50 శాతం, ఓబీసీలకు 27 శాతం, దివ్యాంగులకు మూడు శాతం సీట్లతో పాటు విద్యాహ క్కు చట్టం కింద 25 శాతం సీట్లు రిజర్వు చేసి ఉంటాయి

ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 7వ తేదీ రాత్రి 7 గంటల వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు

 దరఖాస్తు చేసుకునేందుకు

https://-kvsonineadmission.kvs.gov.in

 వెబ్ సైట్, లేదా గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్ లో

kvsonineadmission.kvs.gov.in/appsw.goo

యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు.

NISHTHA-కేంద్ర మానవ వనరుల శాఖామంత్రి, సహాయ మంత్రి ఆంధ్రప్రదేశ్ లో 1200 మంది రిసోర్స్ పర్సన్స్ కు ఆన్ లైన్ నిశిత (NISHTHA) కార్యక్రమం ప్రారంభం

NISHTHA
కేంద్ర మానవ వనరుల శాఖామంత్రి, సహాయ మంత్రి ఆంధ్రప్రదేశ్ లో 1200 మంది రిసోర్స్ పర్సన్స్ కు ఆన్ లైన్ నిశిత (NISHTHA) కార్యక్రమం ప్రారంభం



మొట్ట మొదటి ఆన్ లైన్ నిశిత కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ కు చెందిన 1200 మంది కీ రిసోర్స్ పర్సన్ కోసంకేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి శ్రీ రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్, సహాయ మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే వర్చువల్ పద్ధతిలో ఈరోజు న్యూ ఢిల్లీ నుంచి ప్రారంభించారు.
పాఠశాలల హెడ్మాస్టర్లు, ఉపాధ్యాయుల కోసం కేంద్రం చేపట్టిన శిక్షణా కార్యక్రమమే నిశిత అని కేంద్ర మానవ వనరుల శాఖామంత్రి శ్రీ రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ ఈ సందర్భంగా అన్నారు. నేర్చుకోవటం వలన వచ్చే ఫలితాలను మెరుగుపరచటం కోసం మానవ వనరుల మంత్రిత్వ శాఖ చేపట్టిన సమగ్ర శిక్షలో ఇది ఒక భాగమన్నారు. 2019 ఆగస్టు 21న ఇది ముఖాముఖి కార్యక్రమంగా మొదలైందని, ఆ తరువాత 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ కేంద్ర ప్రభుత్వ పథకాన్ని సమగ్ర శిక్ష కింద చేపట్టాయని అన్నారు. జాతీయ విద్య, పరిశోధన, శిక్షణా మండలి (ఎన్ సి ఇ ఆర్ టి) రాష్ట్ర స్థాయిలో ఈ నిశిత కార్యక్రమాన్ని 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పూర్తి చేసిందని చెప్పారు. అయితే మధ్య ప్రదేశ్, చత్తీస్ గఢ్, జమ్మూ కాశ్మీర్, బీహార్ లో మాత్రం రాష్ట్ర స్థాయిలో శిక్షణ ఇంకా కొనసాగుతోంది. రెండు రాష్ట్రాలలో ఇంకా ప్రారంభం కాలేదని. జిల్లా స్థాయి ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొదలైంది.

23,000 కీ రిసోర్స్ పర్సన్స్ కు, 17.5 లక్షలమంది టీచర్లు, హెడ్మాస్టర్లకు నిశిత పథకం కింద ముఖాముఖి శిక్షణ ఇప్పటివరకూ పూర్తయిందని శ్రీ పోఖ్రియాల్ చెప్పారు.

కోవిడ్ సంక్షోభం కారణంగా ఆకస్మిక లాక్ డౌన్ విధించటంతో ఈ కార్యక్రమాన్ని ముఖాముఖి పద్ధతిలో కొనసాగించ లేక పొయారు. అందుకే, మిగిలి పోయిన 24 లక్షల మంది టీచర్లకు, హెడ్మాస్టర్లకు శిక్షణ పూర్తి చేయటానికి వీలుగా నిశిత కార్యక్రమాన్ని మార్పులు చేసి ఆన్ లైన్ శిక్షణకు అనుగుణంగా దీక్ష, నిశిత పోర్టల్స్ ద్వారా జాతీయ విద్యా పరిశోధన, శిక్షణా మండలి నిర్వహిస్తోందని మంత్రి వివరించారు. ఇలాంటి ఆన్ లైన్ నిశిత శిక్షణ ఆంధ్రప్రదేశ్ తోనే మొదలు పెడుతున్నామన్నారు. 1200 మంది కీ రిసోర్స్ పర్సన్స్ కోసం నిశిత పొర్టల్ ద్వారా ఈ శిక్షణ ఉంటుంది.

వీళ్ళు అంధ్రప్రదేశ్ లోని టీచర్లకు ముందుగా బోధిస్తారు. ఆ తరువాత టీచర్లు నేరుగా దీక్ష పోర్టల్ మీద ఆన్ లైన్ ద్వారా నిశిత శిక్షణ పొందుతారు.
నిష్టా కింద రూపొందించిన మాడ్యూల్స్ ప్రధానంగా పిల్లల సమగ్ర అభివృద్ధి మీద దృష్టి సారిస్తాయని, అందుకే బోధనాంశాల్లో విద్య, ఆరోగ్యం, వ్యక్తిగత, సామాజిక లక్షణాలు, కళతో కూడిన అధ్యయనం, పాఠశాల విద్యలో చేపట్టాల్సిన అంశాలు, పాఠ్యాంశాల వారీగా బోధనా విధానం, నాయకత్వం, పాఠశాల నమోదుకు ముందు విద్య లాంటివి ఉంటాయని చెప్పారు. ఇవి పరస్పర సంభాషణకు అనువుగా ఉంటాయని విద్యా సంబంధమైన ఆటలు, క్విజ్ ద్వారా ఉపాధ్యాయులకు శిక్షణ ఉంటుందని కూడా వెల్లడించారు. దీని వల్ల వాళ్లకు ఇది ఆహ్లాదకరంగా ఉండటంతో బాటు వాళ్ళు తిరిగి పాఠశాలల్లో విద్యార్థులను చురుగ్గా తయారు చేయటానికి పనికొస్తాయన్నారు.
దేశ వ్యాప్తంగా ఉపాధ్యాయుల, హెడ్మాస్టర్ల సామర్థ్యాన్ని పెంచడానికి ప్రాథమిక విద్యా స్థాయిలో మానవ వనరుల మంత్రిత్వ శాఖ, జాతీయ విద్య, పరిశోధన, శిక్షణ మండలి నిశిత ద్వారా చేస్తున్న కృషిని మంత్రి శ్రీ పోఖ్రియాల్ అభినందించారు. కేవలం విద్యార్థుల గ్రహణ శక్తినే కాక వారి సర్వతోముఖాభివృద్ధికి ఇవి దోహదం చేస్తాయన్నారు.
ఈ సందర్భంగా మానవ వనరుల శాఖ సహాయ మంత్రి శ్రీ ధోత్రే మాట్లాడుతూ ప్రపంచం అత్యంత వేగం అభివృద్ధి చెందుతోందన్నారు. ఈ వేగానికి తగినట్టుగా ఉపాధ్యాయులు కూడా తమకున్న దృక్పథాన్ని, అవగాహనను, బోధనా పద్ధతులను పెంచుకోవాల్సి ఉందన్నారు. దేశవ్యాప్తంగా ఇదొక నిరంతర ప్రక్రియ కావాలని సమర్థంగా నిర్వహించాలని సూచించారు.
సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు ఇచ్చే శిక్షణ పూర్తిగా వారి అభిప్రాయాలకు తగినట్టుగా రూప కల్పన జరగాలన్నారు. ఉపాధ్యాయుల అనుభవం దృష్ట్యా వారు సొంతగా కనిపెట్టిన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కూడా కోరారు. వాళ్ళ మాటల ఆధారంగానే ప్రామాణిక బోధనా విధానాలు రూపొందించాలని సూచించారు. దేశపు వైవిధ్యాన్ని వివరిస్తూ ఉపాధ్యాయులకు తెలియ జెప్పాలని, అప్పుడే విద్యార్థులు కూడా ఈ సువిశాల దేశపు వైవిధ్యాన్ని తెలుసుకో గలుగుతారని అన్నారు. అప్పుడే గౌరవ ప్రధాన మంత్రి ప్రస్తావించిన 'ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్' స్ఫూర్తిని విద్యార్థులు నింపుకో గలుగుతారాని అభిప్రాయ పడ్దారు.
నిశిత-ఆన్ లైన్ లో పరస్పర సంభాషణకు అనువైన అనేక విధానాలు కలిసి ఉంటాయి. పాఠ్యాంశాలలో వీడియోలు, లైవ్ సెషన్లు సైతం జాతీయ స్థాయి రిసోర్స్ పర్సన్స్ చెప్పిన వీడియో పాఠాలు స్వయం ప్రభ టీవీ చానల్ లో డిటిహెచ్ ద్వారా అందుతాయి. ఉపాధ్యాయులతో సంభాషణకు అనువుగా ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ( IVRS ) ను వాడుకుంటారు. NCERT, మానవ వనరుల మంత్రిత్వ శాఖ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా మంత్రి ధోత్రే అభినందించారు.
నిశిత ముఖాముఖి కార్యక్రమంలో మొదటి స్థాయి శిక్షణలో భాగంగా కీ రిసోర్స్ పర్సన్స్ (KRP)కు, రాష్ట్రాలు గుర్తించిన స్టేట్ రిసోర్స్ పర్సన్స్ (SLRP)కు నేషనల్ రిసోర్స్ పర్సన్స్ శిక్షణ ఇస్తారు. టీచర్లకు శిక్షణ ఇవ్వటంలో KRP లు కీలక పాత్ర పోషిస్తారు.

FY 2019-20 సంవత్సరానికి సంబంధించి Income Tax e-Filing ఆన్లైన్ లో సబ్మిట్ చేయు విధానం

 FY 2019-20 సంవత్సరానికి సంబంధించి IncomeTax e-Filing ను ఏ విధంగా ఆన్లైన్ లో సబ్మిట్ చేయాలో పూర్తి విధానం తెలుసుకొనుటకు క్రింది Live వీడియో లింక్ ను క్లిక్ చేయండి

https://youtu.be/DerVnZghP9A







 మన CPS PRAN ACCOUNT కి PAN నంబర్ లింక్ చేసే పూర్తి విధానం మరియు ఆన్లైన్ లో PRAN అకౌంట్ లో నామినీ వివరాలు మార్చుకునే పూర్తి విధానం తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి

Ehttps://youtu.be/bNSJT4Z81KE


APPSC DEPARTMENTAL TESTS కొరకు ఎంప్లాయిస్ ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేసే పూర్తి విధానం తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి

https://youtu.be/FeISbjvcq9g


APPSC DEPARTMENTAL TEST కొరకు APPSC వెబ్సైట్ లో OTPR (ONE TIME PROFILE REGISTRATION) రిజిస్ట్రేషన్ చేసుకొనే పూర్తి విధానం తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి

https://youtu.be/5RprtqkZPhI


DEPARTMENTAL TESTS ను ONLINE లో ఎలా వ్రాయాలో తెలియజేయు కంప్లీట్ డెమో వీడియో Mock Tests కొరకు క్రింది వీడియో లింక్ను క్లిక్ చేయండి

https://youtu.be/Zxm39ZVvw3w


 Departmental Test MAY 2020 Notification , Schedule పూర్తి వివరాలు తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి

https://youtu.be/c-W5WJig5Lo

Monday, July 13, 2020

CBDT provides one time relaxation for verification of electronically filed IT Returns

CBDT provides one time relaxation for verification of electronically filed IT Returns


CBDT provides one time relaxation for verification of electronically filed IT Returns for Assessment Yrs 2015-16 to 2019-20 which are pending due to non-filing of ITR-V form & processing of such returns.

CBDT Circular No.13/2020 dt 13th July,2020 issued.

సెప్టెంబరు 30లోగా ఇ-రిటర్న్‌లను పరిశీలించుకోండి: సీబీడీటీ





2015-16 నుంచి 2019-20 మదింపు సంవత్సరాలకు ఇ-ఫైలింగ్‌ చేసిన ఆదాయపు పన్ను రిటర్న్‌లను (ఐటీఆర్‌) వెరిఫికేషన్‌ చేసుకోని పన్ను చెల్లింపుదార్లకు ఆదాయపు పన్ను శాఖ మరో అవకాశం కల్పించింది. 2020 సెప్టెంబరు 30 కల్లా వెరిఫికేషన్‌ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించింది. డిజిటల్‌ సంతకం లేకుండా ఆన్‌లైన్‌ ద్వారా ఆదాయపు పన్ను రిటర్న్‌లను చేసినప్పుడు.. ఆధార్‌ ఓటీపీ లేదా నెట్‌బ్యాంకింగ్‌ ద్వారా ఇ-ఫైలింగ్‌ ఖాతాలోకి లాగిన్‌ అవ్వడం లేదా ఎలక్ట్రానిక్‌ వెరిఫికేషన్‌ కోడ్‌ లేదా బెంగళూరులోని సీపీసీకి సంతకం చేసిన ఐటీఆర్‌-వీ పత్రాలను పంపించడం ద్వారా వెరిఫికేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఐటీఆర్‌లు అప్‌లోడ్‌ చేసిన 120 రోజుల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. అయితే బెంగళూరులోని సెంట్రల్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌ వద్ద వెరిఫికేషన్‌ (ఐటీఆర్‌-వి) పత్రం కోసం వేచి ఉన్న ఇ-ఫైలింగ్‌ రిటర్న్‌లు చాలానే పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తెలిపింది. సకాలంలో ఐటీఆర్‌-వీలను సమర్పించకుంటే ఆ ఐటీఆర్‌లను పరిగణనలోకి తీసుకోరని పేర్కొంది. అందుకే ఈ విషయంలో పన్ను చెల్లింపుదార్లలో నెలకొన్న ఆందోళనను దృష్టిలో ఉంచుకుని 2015-16, 2016-17, 2017-18, 2019-20 మదింపు సంవత్సరాల ఇ-ఫైలింగ్‌ రిటర్న్‌ల వెరిఫికేషన్‌కు సెప్టెంబరు 30 వరకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.




2015-16 నుండి 2019-20 ఐటీ రిటర్న్స్‌ను సెప్టెంబర్ 30లోగా వెరిఫై చేసుకోవాలి.

ఈ-ఫైలింగ్ చేసిన ఆదాయపు పన్ను రిటర్న్స్(ITR)ను వెరిఫికేషన్ చేసుకొని పన్ను చెల్లింపుదారులకు ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్ మరోసారి అవకాశం కల్పించింది. 2015-16 నుండి 2019-20 మదింపు సంవత్సరాలకు సంబంధించి ఎలక్ట్రానిక్ పద్ధతిలో దాఖలు చేసిన పన్ను రిటర్న్స్‌ను వెరిఫై చేసుకోని వారికి ఏకకాల సడలింపులు ఇస్తున్నట్లు ఐటీ విభాగం సోమవారం వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీలోగా రిటర్న్స్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని గడువు ఇచ్చింది. గత మదింపు సంవత్సరాలకు సంబంధించి ఈ-ఫైలింగ్ రిటర్న్స్ దాఖలు చేసి వెరిఫికేషన్ పూర్తి కాని వారికి వర్తిస్తుందని తెలిపింది.

వెరిఫికేషన్ ఇలా.. 
డిజిటల్ సంతకం లేకుండా ఆన్‌లైన్ ద్వారా ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసినప్పుడు ఆధార్ ఓటీపీ (వన్ టైమ్ పాస్ వర్డ్) లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ-ఫైలింగ్ అకౌంట్లోకి లాగిన్ కావడం ద్వారా వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. - లేదా, ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ లేదా బెంగళూరులోని సీపీసీకి సంతకం చేసిన ఐటీఆర్ V పత్రాలను పంపించడం ద్వారా వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఐటీఆర్‌లు అప్ లోడ్ చేసిన 120 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలి.



అందుకే సెప్టెంబర్ 30 వరకు పొడిగింపు 
బెంగళూరులోని సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ వద్ద వెరిఫికేషన్ పత్రం కోసం వేచి ఉన్న ఈ-ఫైలింగ్ రిటర్న్స్ చాలా పెండింగ్‌లో ఉన్నట్లు సీబీడీటీ తెలిపింది. సకాలంలో సమర్పించకుంటే ఆ ఐటీఆర్‌లను పరిగణలోకి తీసుకోరని తెలిపింది. ఈ నేపథ్యంలో వన్ టైమ్ మినహాయింపును ఇస్తున్నట్లు తెలిపింది. పన్ను చెల్లింపుదారుల్లోని ఆందోళనను దృష్టిలో పెట్టుకొని 2015-16, 2016-17, 2017-18, 2018-19, 2019-20 మదింపు సంవత్సరాల ఈ-ఫైలింగ్ రిటర్న్స్ వెరిఫికేషన్‌కు సెప్టెంబర్ 30వ తేదీ వరకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.

అలాంటప్పుడు మినహాయింపులు 
నిర్ణీత కాలంలో ఐటీఆర్-వీను దాఖలు చేసి వెరిఫికేషన్ పూర్తికాకపోతే నాన్-ఈఎస్టీ లేదా పెండింగ్, నాన్ రిసీట్ ఫర్ ఐటీఆర్ వీగా పరిగణించే అవకాశం ఉంది. కాబట్టి ఐటీ డిపార్టుమెంట్ పన్ను చెల్లింపుదారులకు ఈ వెసులుబాటును కల్పించింది. సాధారణంగా 120 రోజుల్లో ఈ పన్ను రిటర్న్స్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. సాంకేతిక కారణాలతో ఇబ్బందులు తలెత్తిన సందర్భాల్లో ఆదాయపు పన్ను శాఖ మినహాయింపులు ఇస్తుంది.

E-SR All Sections Online Data Entry process:

E-SR All Sections Online Data Entry process:

క్రొత్తగా వచ్చిన మార్పులతో  రూల్స్ ప్రకారం ఉదాహరణలతో వివరించబడినవి.





How to set | reset e SR Login Password
https://youtu.be/-xxQCyU_064

How to submit e-SR Part 1?
https://youtu.be/pVtuOeO8_rg

How to submit e-SR Part 2?
https://youtu.be/c4RvsM7TSTs

e-SR Part 3,4,5 Appointment, Probation, Regularisation
https://youtu.be/0bMJiIrlmUE

e-SR పార్ట్ 3,4,5 అప్రెంటిస్ వాళ్ళు అపాయింట్మెంట్ ఎలా ఎంటర్ చేయాలి?
Change in pay లో అప్రెంటిస్ పే ఎలా ఎంటర్ చేయాలి?
https://youtu.be/AdyOPOTBhR0

e-SR పార్ట్ 3,4,5 లో అప్రెంటిస్ వాళ్ళు రెగ్యులర్ పే ఫిక్సేషన్ ఎలా ఎంటర్ చేయాలి?
https://youtu.be/QzWB2Z___QQ

e-SR Part 3, 4, 5 PRC Fixation with Revised Increments, Notional increments with Revised Pay
https://youtu.be/HbH0rR92A3U

e-SR Part 3,4,5 - Change in Pay
https://youtu.be/HdiytMJMPkA

e-SR Part 3,4,5 Leaves Availed, EL Surrender
https://youtu.be/-YvyEd6LxJo

e-SR Part 3, 4, 5 Transfers, Promotions, Deputations, Reversion, Compulsory wait
https://youtu.be/aOp4W7juXcs

e-SR Part 3,4,5 Punishments, Suspensions, Relief, Re-appointment
SGT (ఒక పోస్ట్) నుండి SA (ఇంకొక పోస్ట్) లేదా ఇతర posts కి సెలెక్ట్ అయి, రిజైన్ చేయకుండా జాయిన్ అయిన వాళ్ళు ఎలా నమోదు చేసుకోవాలో వివరించడం జరిగింది.
https://youtu.be/1OsCsxyC25w

e-SR Part 6, 7 LTC, Interest bearing advance
https://youtu.be/YOmkMr9037k

e-SR Part 8, 9 GIS | GPF | CPS | Service Verification | Internal Audit
https://youtu.be/xqN8PibXzck

e-SR Part 10, 11 Departmental Tests & Trainings | Incentives / Awards / Rewards / Seva Patakam
https://youtu.be/XC_Mil4gZq4

e-SR Leave Ledger ELs, HPLs, Child Care Leaves
https://youtu.be/I-dcF83oX3I
please share this useful information

Saturday, July 11, 2020

 E.O పరీక్షపై ఒక విశ్లేషణ...EO పరీక్ష పాసవ్వడం కష్టమా?

చాలా మంది EO, GO పరీక్షను కష్టంగా భావిస్తారు.  ఒక ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ అయితే EO పరీక్ష పాసవ్వడం పెద్ద కష్టమేమీ కాదు. EO పరీక్షను 120 నిమిషాల్లో పూర్తి చేయ వలసి ఉంటుంది. అంటే ప్రతి ప్రశ్నకు సగటున 1.20ని మాత్రమే కేటాయించబడింది.

EO పరీక్షలో కష్టతరమైన అంశాలు

Pension Problems,

Constitution of India లో Articles ను,
Budget Manuel అంశాలలో ఉన్న పేరాలను గుర్తించి వ్రాయ వలసి ఉంటుంది. 
అలాగే Head of Accounts, Tresury Rules కష్టంగా భావిస్తాం.


EO పరీక్ష ఎలా పాసవ్వాలంటే ముందుగా సిలబస్ తెలియాలి

 సిలబస్             

🔹AP Treasury Code,

🔹AP Financial Code,

🔹AP Budget Manual,

🔹AP Pension Code,

🔹Constitution of India,

వీటితో పాటు వర్తమానాంశాలు ప్రిపేర్ అవ్వాలి.

మన దగ్గర Text Books(Bare Acts) ఉంటే ప్రిపేర్ కాకుండా పాసవ్వవచ్చా?

EO పరీక్షకు సంబంధించి టెక్స్ట్ బుక్స్ ఒక్కొక్కటి 100 లేదా 100కు పైగా పేజీలను కలిగి ఉన్నాయి. అన్ని పేజీలలో ఉన్న బిట్స్ ను గుర్తించడం చాలా కష్టం. అందుకని ముందుగా టెక్స్ట్ బుక్స్ లో ఉన్న బిట్ అంశాలను గుర్తించి ముఖ్యాంశాలను అండర్‌లైన్ చేసుకుంటే మంచిది.






EO పరీక్ష ఎలా ప్రిపేర్ కావాలి? 

ముందుగా ఏవైనా గత పరీక్షలకు సంబంధించిన రెండు ప్రశ్నా పత్రాలను వాటి సమాధానాలతో సహా క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎందుకంటే వీటిలో 5 నుండి 10 బిట్లు వస్తున్నాయి.
TOPIC WISE ప్రిపరేషన్
APTC FORMS కు సంబంధించి 7 నుండి 10 బిట్లు వస్తాయి.
APFC FORMS కు సంబంధించి 4 నుండి 5 బిట్లు వస్తాయి.
HEAD OF ACCOUNTS కు సంబంధించి 8 నుండి 10 బిట్లు వస్తాయి.
 PENSION RULES కు సంబంధించి 8 నుండి 10 బిట్లు వస్తాయి.
PENSION PROBLEMS కు సంబంధించి 10 నుండి 15 బిట్లు వస్తాయి.

చాలా మంది వీటిని కష్టతరంగా భావిస్తున్నారు.

 పెన్షన్ లో  Service Pension, Normal Family Pension, Enhanced Family Pension, Gratuity అంశాలను ప్రిపేర్ అయితే వీటికి ఈజీగా సమాధానాలను గుర్తించ వచ్చు.

TREASURY RULES కు సంబంధించి -10 నుండి 12 బిట్లు వస్తాయి.

AP FINANCIAL CODE కు సంబంధించి - 7 నుండి 8 బిట్లు వస్తాయి.

AP BUDGET MANUAL కు సంబంధించి -10 నుండి 12 బిట్లు వస్తాయి.

CONSTITUTION OF INDIA కు సంబంధించి - 8 నుండి 10 బిట్లు వస్తాయి.

 PF RULES కు సంబంధించి - 3 నుండి 4 బిట్లు వస్తాయి.

వీటితో పాటు వర్తమానాంశాలైన CPS, PRC, APGLI కు సంబంధించి -10 నుండి 15 బిట్లు వస్తాయి.



APPSC Departmetntal Tests Books Available Shops in AP&Hyd:

📚 Books Available Place -- Book Shop Names

 Hyderabad
 -- Law Publico Ph:24616469

Ananthapur
 -- Vasavi Book Stall
Ph:9849898487, Jyothi Book Stall
Ph:08554221598 & SIV Book Stall
Ph:9848080123

 Chittoor
-- Pragathi Book Centre 
Ph:08572226326

 Cuddapa
-- Vijaya Lakshmi Enterprises
Ph:08562243227 & SRS Agencies
Ph08562243667

 Eluru
-- Vijaya & Co Ph:9395511155

Guntur
-- Sri Venkateswara Book Depot
Ph:08636642924

Kakinada
 -- Sudhita Book Centre
Ph:08842368677

 Kurnool
-- Krishna Book Depot
Ph:08518245578

Machilipatnam -- New Minerva Book Depot
*Ph:08672222679

Nellore
-- Sri Ramakrishna Book Depot 
Ph:08612327391

Ongole
-- Sri Venkateswara Book Depot
 Ph:08592232176

Srikakulam
 -- Jyothi Book Depot
Ph:08942229515
& Prakash Babu Book Stall
Ph:08942226450

Tirupathi
Lakshmi narayana Publications
Ph:9000598974 & Yogaprabha Book Links
Ph:08772250672


వీటిని క్షుణ్ణంగా ప్రిపేర్ అయినట్లయితే ఈ మార్కులను ఈజీ గా సంపాదించవచ్చు. మెటీరియల్ ఆధారంగా పైన వివరించిన టాపిక్ ల ప్రాధాన్యతా క్రమంలో ప్రిపేర్ అయినట్లయితే ఈజీ గా EO పరీక్షను పాసవ్వవచ్చు.



DDO CODES FOR E-SR PURPOSE

DDO CODES FOR E-SR PURPOSE
E-SR లో మనం పని చేసిన మరియు ట్రాన్స్ఫర్ అయిన మండలం యొక్క DDO Code లను ఎంటర్ చేయాలి. మీకు మీ DDO Code  తెలియక పోతే మీ జిల్లా మరియు ట్రెజరీ పేరు ఇచ్చి  క్రింది  లింక్  ద్వారా తెలుసుకోవచ్చు.





https://prdcfms.apcfss.in:44300/sap/bc/ui5_ui5/sap/zfi_ddo_finder/index.html?sap-client=350&sap-ui-theme=cfms@https://prdcfms.apcfss.in:44300/sap/public/bc/themes/~client-350

ఏపీ ప్రజలకు అలర్ట్.. ఆరోగ్యశ్రీ కింద కరోనా చికిత్స అందించే ఆస్పత్రుల జాబితా...

ఏపీ ప్రజలకు అలర్ట్.. ఆరోగ్యశ్రీ కింద కరోనా చికిత్స అందించే ఆస్పత్రుల జాబితా... 





కేటగిరీ-1 ఆస్పత్రుల జాబితా:

1 ANANTAPUR: Saveera Hospital Pvt Ltd, Anantapur Private Hospitals
2 CHITTOOR: Apollo hospitals Enterprises Ltd - A & ARAGONDA(CHITTOOR) Private Medical College
3 CHITTOOR: Padmavati Medical College, Tirupati Govt Medical College
4 EAST GODAVARI: Gsl Medical College And Gsl General Hospital, Rajanagaram Private Medical College
5 GUNTUR NRI: Academy of Sciences Private Medical College
6 GUNTUR AIIMS: Central Ministry Hospital
7 KRISHNA: Pinnamaneni Institue Of Medical Sciences, Gannavaram Private Medical College
8 KRISHNA: GGH Vijayawada Govt Medical College
9 KURNOOL: Shantiram Medical College General Hospital Private Medical College
10 PRAKASAM: KIMS HOSPITALS, ONGOLE Private Hospitals
11 SPSR NELLORE: Narayana Medical College & Hospital Private Medical College
12 SPSR NELLORE: Govt General Hospital Nellore Govt Medical College
13 SRIKAKULAM: GEMS HOSPITAL ADITYA EDUCATION SOCIETY - SRIKAKULAM Private Medical College
14 VISAKHAPATANAM: Visakha Institute of Medical Sciences - Visakhapatnam Govt Medical College
15 VISAKHAPATANAM: Gitam Institute Of Medical Sciences And Research&Visakhapatnam Private Medical College
16 VISAKHAPATANAM: INHS Central Ministry Hospital
17 VIZIANAGARAM: MIMS HOSPITAL,NELLIMARLA,VIZIANGARAM Private Medical College
18 WEST GODAVARI: Alluri Sitarama Raju Academy Of Medical Sciences (Asram Hospital), Eluru Private Medical College
19 KADAPA: Fathima Inistitute of Medical Sciences Private Medical College

కేటగిరి-2 జాబితా:

1 ANANTAPUR: CHANDRA SUPER SPECIALTY HOSPITAL, ANANTAPUR Private Hospitals
2 ANANTAPUR: Government General Hospital, Anantapur Govt Medical College
3 ANANTAPUR: Dr. YSR Memorial Hospital, Sai Nagar, Anantapur Private Hospitals
4 ANANTAPUR: District Hospital , Hindupur Govt Hospitals
5 ANANTAPUR: Rural Development Trust Hospital, Bathalapalli, Anantapur dist. Private Medical College
6 CHITTOOR: ESI, HOSPITAL Govt Hospitals
7 CHITTOOR: SVRR GGH, Tirupati Govt Medical College
8 CHITTOOR: AMARA HOSPITAL, Tirupathi Private Hospitals
9 CHITTOOR: PESIMSR-Kuppam Private Medical College
10 CHITTOOR: BIRRD HOSPITAL, Tirupathi Private Hospitals
11 EAST GODAVARI: Konaseema Institute of Medical Science, Amalapuram Private Medical College
12 EAST GODAVARI: Sri Kiran Institute of Ophthalmology, Kakinada Private Hospitals
13 EAST GODAVARI: District Hospital, Rajamahendravaram Govt Hospitals
14 EAST GODAVARI: Hope International Hospital, Kakinada Private Hospitals
15 EAST GODAVARI: KIMS (Bollineni) Hospitals, (A Unit Of Bollineni Heart Centre Pvt Ltd), Rajahmundry Private Hospitals
16 GUNTUR: Katuri Medical College And Hospital Private Medical College
17 GUNTUR: Manipal Health Enterprises Pvt Ltd Private Hospitals
18 GUNTUR: District Hospital, Tenali Govt Hospitals
19 GUNTUR: GGH Guntur Govt Medical College
20 GUNTUR: Lalitha Super Speciality Hospital P Ltd Private Hospitals
21 GUNTUR: Dvc Hospital And Research Centre Private Hospitals
22 KRISHNA: Liberty Hospitals, Auto Nagar, Vijayawada Private Hospitals
23 KRISHNA: Kamineni Hospital, Kanuru, Vijayawada Rural Private Hospitals
24 KRISHNA: Aayush Nri Lepl Healthcare Pvt Ltd, Ring Road, Vijayawada Private Hospitals
25 KRISHNA: Andhra Hospitals Bhavanipuram Pvt Ltd, Bhavani puram, Vijayawada Private Hospitals
26 KRISHNA: District Hospital -Machilipatnam Govt Hospitals
27 KRISHNA: Nimra Institute Of Medical Sciences And Research Center, Kondapalli, Vijayawada Private Medical College
28 KURNOOL: VISWABHARATHI HOSPITAL Private Medical College
29 KURNOOL: Medicover Hospital, Near APSRTC Bus Stand, Sampath Nagar, Kurnool, Private Hospitals
30 KURNOOL: OMEGA HOSPITALS A UNIT OF KURNOOL INSTITUTE OF ONCOLOGY PVT LTD Private Hospitals
31 KURNOOL: AMEELIO HOSPITAL A UNIT OF SURAKSHITHA HEALTHCARE PVT LTD Private Hospitals
32 KURNOOL: GGH Kurnool Govt Medical College
33 PRAKASAM: District Hospital Markapuram Govt Hospitals
34 PRAKASAM: GGH Ongole Govt Medical College
35 PRAKASAM: VENKATARAMANA HOSPITALS Private Hospitals
36 PRAKASAM: RAMESH SANGHAMITRA HOSPITAL Private Hospitals
37 PRAKASAM: NALLURI NURSING HOME Private Hospitals
38 SPSR NELLORE: Simhapuri Hospital Private Hospitals
39 SPSR NELLORE: Apollo Speciality Hospitals Private Hospitals
40 SPSR NELLORE: Lotus Hospital Private Hospitals
41 SPSR NELLORE: Nellore Hospital, Muthukur Road, Nellore Private Hospitals
42 SPSR NELLORE: Anasuya Institue of medical Sciences Private Medical College
43 SRIKAKULAM: District Hospital Tekkali Govt Hospitals
44 SRIKAKULAM: GMR VARALAKSHMI CARE HOSPITAL - RAJAM Private Hospitals
45 SRIKAKULAM: DR GOLIVI HOSPITAL - SRIKAKULAM Private Hospitals
46 SRIKAKULAM: Santhi Nursing Home, Kiranmouli Shopping Complex, Rama Laxmana Junction Private Hospitals
47 SRIKAKULAM: GGH Srikakulam Govt Medical College
48 VISAKHAPATANAM: M B Multispeciality Hospitals&Visakhapatnam Private Hospitals
49 VISAKHAPATANAM: Apollo Hospitals Enterprises Ltd - Visakhapatnam Private Hospitals
50 VISAKHAPATANAM: NRI Anil Neerukonda Hospital, Sangivalasa Private Hospitals
51 VISAKHAPATANAM: Indus Hospital, Jagadamba Junction, Maharani Peta, Visakhapatnam Private Hospitals
52 VISAKHAPATANAM: Gayatri Vidya Parishad Institute Of Health Care And Medical Technology&Visakhapatnam Private Hospitals
53 VIZIANAGARAM: Pushpagiri Eye Hospital Private Hospitals
54 VIZIANAGARAM: Gayatri Hospital, Subramanyam Peta, Babametta, Vizianagaram Private Hospitals
55 VIZIANAGARAM: Queen' s NRI Hospital Private Hospitals
56 VIZIANAGARAM: District Hospital Vizainagaram Govt Hospitals
57 VIZIANAGARAM: sri sai super specialty hospital Private Hospitals
58 WEST GODAVARI: AH-TADEPALLIGUDEM Govt Hospitals
59 WEST GODAVARI: District Hospital Eluru Govt Hospitals
60 WEST GODAVARI: APPLE HOSPITAL A UNIT OF TANUKU HOSPITAL, TANUKU Private Hospitals
61 WEST GODAVARI: Bhimavaram Hospital, J.P.Road,Bhimavaram Private Hospitals
62 WEST GODAVARI: New Life Hospital, Palakole Private Hospitals
63 Y.S.R. KADAPA: AH- PULIVENDULA Govt Hospitals
64 Y.S.R. KADAPA: Sunrise Hospital, Kadapa Private Hospitals
65 Y.S.R. KADAPA: Sri Sri Holistic Hospital - Kadapa Private Hospitals
66 Y.S.R. KADAPA: DH Proddutur Govt Hospitals
67 Y.S.R. KADAPA: GGH Kadapa Govt Medical College

ప్రైవేటు ఆస్పత్రుల్లో వసూలు చేయాల్సిన ఫీజుల వివరాలు
నాన్‌ క్రిటికల్‌ కరోనా పేషేంట్ల వైద్యానికి రోజుకు రూ. 3,250

క్రిటికల్‌ కోవిడ్‌-19 పేషెంట్లకు ఐసీయూలో వెంటిలేటర్లు, ఎన్‌ఐవీ లేకుండా ఉంచితే రోజుకి రూ. 5,480

ఎన్‌ఐవీతో ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తే రోజుకి రూ. 5,980

వెంటిలేటర్‌ పెట్టి వైద్యం అందిస్తే రోజుకి రూ. 9,580

ఇన్ఫెక్షన్‌ ఉన్న వారికి వెంటిలేటర్‌ లేకుండా వైద్యం అందిస్తే రోజుకి రూ. 6,280

ఇన్ఫెక్షన్ ఉండి, వెంటిలేటర్ పెట్టి వైద్యం అందిస్తే రోజుకి రూ.10,380

ఏపీ ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్‌ పరిధిలోని ఆస్పత్రులన్నీ ఇవే ఫీజులను వసూలు చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Teachers information System (TIS) ఫాస్ట్ సర్వర్ లింక్స్ జిల్లాల వారీగా ఇవ్వబడ్డాయి.


Teachers information System (TIS) 

  LOGIN :: ఫాస్ట్ సర్వర్ లింక్స్ జిల్లాల వారీగా  ఇవ్వబడ్డాయి.




ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://cse.ap.gov.in/DSENEW/

*1. స్కూల్ లాగిన్ లో లాగిన్ అయి, ప్రాసెస్ పై క్లిక్ చేసి, ఇవ్వబడిన బాక్సులో ట్రెజరీ ఐడిని ఇచ్చి టీచర్ కార్డు ని డౌన్లోడ్ చేసుకోండి. మరియు ప్రింట్ తీసుకోండి.*

*2. టీచర్ కార్డును వెరిఫై చేసుకుని, తప్పులు ఏమైనా గమనిస్తే, ఆ ప్రింట్ కాపీ పై రెడ్ పెన్నుతో తప్పులను సరి చేసుకోండి.*

*3. టీచర్ కార్డు లోని తప్పులను  వ్యక్తిగతంగా సరిచేయుట కు  ఇండివిడ్యువల్ ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు.*

*4. ఉపాధ్యాయుల బదిలీల నిమిత్తం TIS EDIT చేసుకోవటానికి ప్రైమరీ టీచర్స్ కి MEO గారి యొక్క లాగిన్ లో/ హై స్కూల్ టీచర్స్ కు HM గారి లాగిన్ లో ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది. త్వరగా సరి చేయించుకోండి.*




🅰🅿ఉద్యోగుల సందేహాలకు సమాధానాలు

 🅰🅿   ఉద్యోగుల సందేహాలకు సమాధానాలు

CPS ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ వర్తిస్తుందా? 

ఏ ఉద్యోగులు కనీసం ఎంత మొత్తంలో APGLI ప్రీమియం ను కలిగి ఉండాలి..?

EWF అంటే ఏమిటి? దీని వల్ల ఉద్యోగులకు గలఉపయోగం ఏమిటి..?

APGLI లోన్ ఎంత ఇస్తారు..?

స్కూల్ అసిస్టెంట్ హై స్కూల్ కు FAC ప్రధానోపాధ్యాయునిగా విధులు నిర్వర్తిస్తే అలెవెన్స్ ఇస్తారా..?


https://www.youtube.com/watch?v=ilDVe5g8BOs

Friday, July 10, 2020

డిపార్టుమెంటల్ టెస్ట్స్ ప్రత్యేకం..

డిపార్టుమెంటల్ టెస్ట్స్ ప్రత్యేకం..

EOT 141 పరీక్షలో పెన్షన్ సమస్యలు 10 నుండి 12 వచ్చే అవకాశం ఉంది. వీటిని సాధించాలంటే పెన్షన్ రూల్స్, Basics తెలిసి ఉండాలి. సులభంగా అర్ధమయ్యే విధంగా..*




*BASICS OF PENSION*






పెన్షన్ రూల్స్



https://www.youtube.com/watch?v=qjmBhaf3CYU


డిపార్టుమెంటల్ టెస్ట్స్ యాప్

👨‍👩‍👧‍👦👩‍👩‍👧👩‍👦👩‍👧‍👦*నేడు ప్రపంచ జనాభా దినోత్సవం*



👨‍👩‍👧‍👦👩‍👩‍👧👩‍👦👩‍👧‍👦*నేడు ప్రపంచ జనాభా దినోత్సవం* (World Population Day) సందర్భంగా... 👩‍👧‍👦👩‍👦👩‍👩‍👧👨‍👩‍👧‍👦

    *నేడు ప్రపంచ జనాభా దినోత్సవం* (World Population Day) :
ఒక దేశ ఆర్ధిక ప్రణాళికలు , సామాజిక పథకాలు రూపొందించడానికి జనాభా లెక్కలు అవసరము . అటువంటి లెక్కలను ప్రతి దేశమూ సిద్ధం చేసుకుంటుంది. జనాభా లెక్కల ఆధారము గానే ప్రభుత్వ పథకాల రూపకల్పన, వెనుక బడిన ప్రాంతాలు, వర్గాలు గుర్తింపు వంటివి జరుగుతాయి. అందువల్ల జనాభా లెక్కలకు అంత ప్రాధాన్యత , ప్రాముఖ్యత ఉన్నది .

నానాటికి పెరుగుతున్న జనాభా.. తద్వారా తలెత్తే దుష్పరిణామాలను ప్రజలకు వివరించేందుకు, వారికి ఆయా సమస్యలపై అవగాహన కలిగించేందుకు ప్రతి ఏటా జూలై 11వ తేదీన "ప్రపంచ జనాభా దినోత్సవాన్ని" నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా జనాభా పెరుగుదలకు, తరుగుదలకు సంబంధించిన విషయాల గురించి ప్రజలలో చలనం తెచ్చేందుకుగాను ఐక్యరాజ్య సమితి 1989వ సంవత్సరంలో దీనిని ప్రారంభించింది*.





11 జూలై 1987న జన్మించిన ఒక శిశువుతో ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరింది. అందువలన ఆ రోజు నుండి జులై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవంగా పాటిస్తున్నారు. ప్రపంచ జనాభాలో 40 శాతం మూడవ ప్రపంచ దేశా లైన ఇండియా, చైనాలలోనే ఉన్నారు. ప్రపంచ జనాభా ప్రతి సంవత్సరం 9 కోట్ల 20 లక్షలు అదనంగా పెరుగుతోంది. ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన జనాభా నివేదిక ప్రకారం ఈ శతాబ్ధానికి ప్రపంచ జనాభా 700 కోట్లకు చేరుకుంటుందని అంచనా*.

1987వ సంవత్సరంలో ప్రపంచ జనాభా ఐదు బిలియన్లకు చేరుకున్న రోజు "జూలై 11" కాబట్టి... ఆరోజును "ప్రపంచ జనాభా దినం" గా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. ఇక అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి ఏడాది జూలై 11వ తేదీన ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఆ రోజు నుంచి 20 సంవత్సరాల తరువాత జూలై 11,
 2007లో చూస్తే ప్రపంచ జనాభా 6,602,226,175కు చేరుకున్నట్లు ఐరాస వెల్లడించింది..

ఆ తరువాత 2008 జూన్ 28 నాటికి ప్రపంచ జనాభా 6.7 బిలియన్ల వద్ద ఉండగా,

2012 నాటికి 7 బిలియన్లను చేరుకుంటుందని ఐరాస తెలిపింది.

మరో యాభై ఏళ్లలో ప్రపంచ జనాభా 9 బిలియన్లను చేరే అవకాశముందని కూడా సమితి పేర్కొంది. కాగా అమెరికా 304 మిలియన్ల మంది జనాభాతో మూడో స్థానంలో ఉండగా చైనా, భారత్‌లు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.

పెరుగుతున్న జనాభాలో అభివృద్ధి చెందుతున్న దేశాలు కీలకపాత్ర పోషిస్తున్నట్టు ఈ సందర్భంగా సమితి అభిప్రాయపడింది. భారత్, అమెరికా, చైనా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ తదితర తొమ్మిది దేశాలు వచ్చే 2050 నాటికి ప్రపంచ జనాభాలో సగం శాతాన్ని ఆక్రమిస్తాయని సమితి తెలిపింది.

తమ గణాంకాల ప్రకారం 2050 నాటికి ప్రపంచ జనాభా 9.1 బిలియన్లకు చేరుకుంటుందని... అదేసమయంలో వచ్చే 50ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా మహిళల సంతానోత్పత్తి శాతం సరాసరిగా 2.5 నుంచి 2.1కి పడిపోతుందని తమ గణాంకాల్లో వెల్లడైందని సమితి తెలియ జేసింది.
ఐక్యరాజ్య సమితి జనాభా విభాగం వారి అంచనా ప్రకారం.. 1800 నాటికి ప్రపంచ జనాభా ఒక బిలియన్ లోపే ఉంది. తరువాతి బిలియన్ పెరగడానికి 123 సంవత్సరాలు పట్టింది. ఐతే 33 సంవత్సరాలలోనే ఇంకో బిలియన్ పెరిగింది. ఇలా ఉన్నకొద్దీ వేగంగా పెరిగి ప్రస్తుత ప్రపంచ జనాభా 6 బిలియన్లపైనే ఉంది*

*ఇంతింతై వటుడింతింతై" అన్న చందంగా నానాటికీ పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్లుగా ప్రకృతి వనరులు తరిగిపోతున్నా... వాటిని ఎప్పటికప్పుడు రీఛార్జి చేసుకునేందుకు, లేదా సహజ వనరుల్ని పొదుపుగా వాడుకునేందుకు ఎవరూ ప్రయత్నించటం లేదు. కాబట్టి ప్రకృతి వనరుల ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ, పర్యావరణాన్ని కాపాడుకునేలా చేయాలి.

ఊహించడమే ఆందోళన కలిగిస్తోంది.

భూమాత జనభారాన్ని ఎంతని మోస్తుంది? పర్యావరణ, వాతావరణ, వనరుల స్థితిగతులు ఏమవుతాయి?
ప్రజల జీవన ప్రమాణాల పయనం ఎలాగుంటుంది? అంతా అగమ్యగోచరం...అధిక జనాభా వల్ల కలిగే దుష్ఫలితాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించి తద్వారా వారు కుటుంబ నియంత్రణ పాటించేలా చేయడం వల్ల మాత్రమే జనాభా పెరుగుదలను నియంత్రించడం సాధ్యపడుతుంది.

*జనాభా పెరుగుదల వల్ల కలిగే నష్టాలు:*
 ఆర్థికంగా కుంగిపోవడం,
నిరక్షరాస్యత,
అవసరాలు తీరకపోవడం,
భూమిపై స్థలం సరిపోకపోవడం..

మన బాధ్యత:
పైన పేర్కొన్న సమస్యలను ఆయా ప్రభుత్వాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. ఈ విషయాలపై వారికి క్షుణ్ణంగా అవగాహన కల్పించి, వాళ్లే వాలంటరీగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకునేలా ప్రోత్సహించాలి. ఈ రకంగా ఎవరికివారు జనాభా నియంత్రణకు పూనుకున్నట్లయితే భూమాత భారాన్ని కాస్తయినా తగ్గించిన వారవుతాము

Thursday, July 9, 2020

🅰🅿 Rc.151, Dt. 9.7.2020 Instructions by CSE to close all educational institutions up to 31st july 2020 ,as per Unlock 2 guidelines, alternate arrangements to be made.

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ జూలై 6 న ఇచ్చిన సూచనల ప్రకారం జూలై 31 వరకు పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్స్ తెరవకూడదని, NCERT చే అభివృద్ధి ప్రత్యామ్నాయ అకడమిక్ క్యాలెండర్స్ కమ్యూనికేషన్ చేస్తూ మరిన్ని సూచనలు జారీచేసిన పాఠశాల విద్యాశాఖ కమీషనర్.
(ఉపాధ్యాయుల హాజరుకి సంబంధించి ఎటువంటి వివరణ ఇవ్వలేదు)







lternative Academic Calendar for Primary, Upper Primary and Secondary Stage developed by NCERT – Communications &Certain instructions RC.151
▪️ పాఠశాలలు 31.07.20 వరకు మూసివేయాలి
▪️ ఆన్లైన్ బోధన దూరవిద్య బోధన కొనసాగింపు
▪️ ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల నుండి ఎలాంటి ఫీజులు వసూలు చేయరాదు

▪️ విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు నిర్వహించ రాదు


Monday, July 6, 2020

AP MODEL SCHOOL VI CLASS ADMISSIONS (2020-21)



AP MODEL SCHOOL VI CLASS ADMISSIONS (2020-21)

DOWNLOAD SUBMIT APPLICATION

https://apms6thappl08022020.apcfss.in/downloadApplicationAPMS1504198702012020.apms





CLEAR AND LONG STANDING VACANCIES PROFORMA-1.xls

CLEAR AND LONG STANDING VACANCIES PROFORMA-1.xls

All DEOs are collecting the following particulars  from  Dy.E.Os / M.E.Os in  the above proforma.



 LIST OF CLEAR VACANCIES as on  30-06-2020              
        
     8 years vacancy particulars  ( Teachers working  before 18-11-2012 and Headmasters working before 18-11-2015) in the present school                

Note: All Dy.E.Os/M.E.Os are requested to submit 8/5 years  partculars on or before 07-07-2020 at 5pm otherwise intimate to higher officials )            

Note: 1. Headmaster of high schools who joined before 18-11-2015 in the present school  (i.e .5 years vacancy)                

Note: 2. SA/LP/PET/SGT /Craft/LFLHM/ others  of Primary, Upper primary and High schools teachers who joined before 18-11-2012 in the present school .(i.e .8 years vacancy)          

   

Sunday, July 5, 2020

డిపార్టుమెంటల్ పరీక్షలు , మే - 2020 సెషన్ ముఖ్యమైన సమాచారం

🅰🅿 డిపార్టుమెంటల్ పరీక్షలు , మే - 2020 సెషన్ ముఖ్యమైన సమాచారం

ఆన్ లైన్ లో అప్లై చేయుట : 08.07.2020 నుండి 27.07.2020 వరకు

ఫీజు చెల్లించుట : 08.07.2020 నుండి 26.07.2020 వరకు




      ఫీజు వివరాలు :

       G.O.Test : 1500/-

      E.O.Test : 1000/-

       Spl.Language Test :  1000/-

    పరీక్షల తేదీలు :

      G.O.Test (Paper Code : 88) : 27.08.2020 - 10 AM to 12 Noon

       G.O.Test (Paper Code : 97) : 27.08.2020 - 3 PM to 5 PM

       E.O.Test (Paper Code : 141) : 28.08.2020 - 10am to 12 Noon

      Spl.Language Test (Paper Code : 37) : 28.08.2020 - 3 pm to 6 pm

పాస్ మార్కులు :
       ప్రతి పేపరులో 35 మార్కులు రావలెను. G.O.T నందు గల రెండు పేపర్లలో ప్రతి పేపరులో 35 మార్కులు రావలెను. ఏ ఒక్క పేపరులో 35 కంటే తక్కువ మార్కులు వచ్చినా రెండు పేపర్లు మరలా రాయాలి.

నెగెటివ్ మార్కులు :
      ప్రతి తప్పు జవాబుకు 1/3 మార్కులు అనగా 0.33 మార్కులు తగ్గించబడును. అనగా ప్రతి 3 తప్పు జవాబులకు 1 మార్కు తగ్గును.