CBDT provides one time relaxation for verification of electronically filed IT Returns
CBDT Circular No.13/2020 dt 13th July,2020 issued.
సెప్టెంబరు 30లోగా ఇ-రిటర్న్‌లను పరిశీలించుకోండి: సీబీడీటీ
2015-16 నుంచి 2019-20 మదింపు సంవత్సరాలకు ఇ-ఫైలింగ్ చేసిన ఆదాయపు పన్ను రిటర్న్‌లను (ఐటీఆర్) వెరిఫికేషన్ చేసుకోని పన్ను చెల్లింపుదార్లకు ఆదాయపు పన్ను శాఖ మరో అవకాశం కల్పించింది. 2020 సెప్టెంబరు 30 కల్లా వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించింది. డిజిటల్ సంతకం లేకుండా ఆన్‌లైన్ ద్వారా ఆదాయపు పన్ను రిటర్న్‌లను చేసినప్పుడు.. ఆధార్ ఓటీపీ లేదా నెట్‌బ్యాంకింగ్ ద్వారా ఇ-ఫైలింగ్ ఖాతాలోకి లాగిన్ అవ్వడం లేదా ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ లేదా బెంగళూరులోని సీపీసీకి సంతకం చేసిన ఐటీఆర్-వీ పత్రాలను పంపించడం ద్వారా వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐటీఆర్‌లు అప్‌లోడ్ చేసిన 120 రోజుల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. అయితే బెంగళూరులోని సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ వద్ద వెరిఫికేషన్ (ఐటీఆర్-వి) పత్రం కోసం వేచి ఉన్న ఇ-ఫైలింగ్ రిటర్న్‌లు చాలానే పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తెలిపింది. సకాలంలో ఐటీఆర్-వీలను సమర్పించకుంటే ఆ ఐటీఆర్‌లను పరిగణనలోకి తీసుకోరని పేర్కొంది. అందుకే ఈ విషయంలో పన్ను చెల్లింపుదార్లలో నెలకొన్న ఆందోళనను దృష్టిలో ఉంచుకుని 2015-16, 2016-17, 2017-18, 2019-20 మదింపు సంవత్సరాల ఇ-ఫైలింగ్ రిటర్న్‌ల వెరిఫికేషన్‌కు సెప్టెంబరు 30 వరకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.
2015-16 నుండి 2019-20 ఐటీ రిటర్న్స్‌ను సెప్టెంబర్ 30లోగా వెరిఫై చేసుకోవాలి.
ఈ-ఫైలింగ్ చేసిన ఆదాయపు పన్ను రిటర్న్స్(ITR)ను వెరిఫికేషన్ చేసుకొని పన్ను చెల్లింపుదారులకు ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్ మరోసారి అవకాశం కల్పించింది. 2015-16 నుండి 2019-20 మదింపు సంవత్సరాలకు సంబంధించి ఎలక్ట్రానిక్ పద్ధతిలో దాఖలు చేసిన పన్ను రిటర్న్స్‌ను వెరిఫై చేసుకోని వారికి ఏకకాల సడలింపులు ఇస్తున్నట్లు ఐటీ విభాగం సోమవారం వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీలోగా రిటర్న్స్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని గడువు ఇచ్చింది. గత మదింపు సంవత్సరాలకు సంబంధించి ఈ-ఫైలింగ్ రిటర్న్స్ దాఖలు చేసి వెరిఫికేషన్ పూర్తి కాని వారికి వర్తిస్తుందని తెలిపింది.
వెరిఫికేషన్ ఇలా..
డిజిటల్ సంతకం లేకుండా ఆన్‌లైన్ ద్వారా ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసినప్పుడు ఆధార్ ఓటీపీ (వన్ టైమ్ పాస్ వర్డ్) లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ-ఫైలింగ్ అకౌంట్లోకి లాగిన్ కావడం ద్వారా వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. - లేదా, ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ లేదా బెంగళూరులోని సీపీసీకి సంతకం చేసిన ఐటీఆర్ V పత్రాలను పంపించడం ద్వారా వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఐటీఆర్‌లు అప్ లోడ్ చేసిన 120 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలి.
అందుకే సెప్టెంబర్ 30 వరకు పొడిగింపు
బెంగళూరులోని సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ వద్ద వెరిఫికేషన్ పత్రం కోసం వేచి ఉన్న ఈ-ఫైలింగ్ రిటర్న్స్ చాలా పెండింగ్‌లో ఉన్నట్లు సీబీడీటీ తెలిపింది. సకాలంలో సమర్పించకుంటే ఆ ఐటీఆర్‌లను పరిగణలోకి తీసుకోరని తెలిపింది. ఈ నేపథ్యంలో వన్ టైమ్ మినహాయింపును ఇస్తున్నట్లు తెలిపింది. పన్ను చెల్లింపుదారుల్లోని ఆందోళనను దృష్టిలో పెట్టుకొని 2015-16, 2016-17, 2017-18, 2018-19, 2019-20 మదింపు సంవత్సరాల ఈ-ఫైలింగ్ రిటర్న్స్ వెరిఫికేషన్‌కు సెప్టెంబర్ 30వ తేదీ వరకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.
అలాంటప్పుడు మినహాయింపులు
నిర్ణీత కాలంలో ఐటీఆర్-వీను దాఖలు చేసి వెరిఫికేషన్ పూర్తికాకపోతే నాన్-ఈఎస్టీ లేదా పెండింగ్, నాన్ రిసీట్ ఫర్ ఐటీఆర్ వీగా పరిగణించే అవకాశం ఉంది. కాబట్టి ఐటీ డిపార్టుమెంట్ పన్ను చెల్లింపుదారులకు ఈ వెసులుబాటును కల్పించింది. సాధారణంగా 120 రోజుల్లో ఈ పన్ను రిటర్న్స్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. సాంకేతిక కారణాలతో ఇబ్బందులు తలెత్తిన సందర్భాల్లో ఆదాయపు పన్ను శాఖ మినహాయింపులు ఇస్తుంది.
No comments:
Post a Comment