Wednesday, June 10, 2020

10 జూన్ 2020 నుండి బ్రిడ్జ్ కోర్స్ ప్రారంభం

 


*🅰🅿 ANDHRA TEACHERS*


*📕నేటి నుంచి బ్రిడ్జి కోర్సు ప్రారంభం📕*



 *📺 టీవీల ముందుకు విద్యార్థులు*



*🔸ఆగస్టు 3 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని నిర్ణయించినా ఈలోగా విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా దూరదర్శన్‌ సప్తగిరి ఛానల్‌ ద్వారా పాఠాల బోధనకు ఏర్పాట్లు చేసింది.*



 *🔹ఇందుకు అర్హులైన ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారితో చెప్పించిన పాఠ్యాంశాలను రికార్డు చేయించింది. బుధవారం నుంచి అమలులోకి రానున్న ఈ ప్రక్రియలో జిల్లా నుంచి 12 మంది భాగస్వాములైనట్లు సమాచారం.*



 *🔸జిల్లాలో 1 నుంచి 10 తరగతుల విద్యార్థులు మొత్తం 2.80 లక్షల మంది ఉన్నారని ఇటీవల ప్రధానోపాధ్యాయుల ద్వారా వివరాలు సేకరించారు. టీవీలు, స్మార్ట్‌ఫోన్లు ఎంతమందికి ఉన్నాయనేది తెలుసుకున్నారు. కొద్ది మినహా ఎక్కువ మందికి టీవీలే అందుబాటులో ఉన్నాయని ప్రత్యేకమైన షెడ్యూలు రూపొందించారు. టీవీల్లో పాఠాలు చూసే సమయంలో ఏదైనా అర్థంకాని అంశం ఉంటే విద్యార్థి దానిని నమోదు చేసుకొని వారంలో ఒకరోజు పాఠశాలకు తప్పనిసరిగా వచ్చే తరగతి ఉపాధ్యాయుని వద్దకు వెెళ్లి సందేహాలు నివృత్తి చేసుకోవాలి.*



*🍁షెడ్యూలు ఇలా..*



*🔸ప్రతిరోజూ ఉదయం 11 నుంచి గంటపాటు 1 నుంచి 5 తరగతుల వారికి బ్రిడ్జి కోర్సు బోధిస్తారు. ఇటీవల వారి స్థాయిలను ఉపాధ్యాయులు గుర్తించి 1, 2గా విభజించారు. ఆ సమయంలోనే రెండుస్థాయిల విద్యార్థులకు బోధిస్తారు.*



*🔸6 నుంచి 10వ తరగతి వరకు జులై నెల పాఠ్యాంశాల బోధన జరుగుతుంది. వారికి అవసరమైన పాఠ్యపుస్తకాలు పాఠశాలలకు వచ్చాయి.*



*🔹1-5 తరగతుల పుస్తకాలు రావాల్సివుంది. మధ్యాహ్నం 2 నుంచి గంటపాటు 6, 7, మధ్యాహ్నం 3 నుంచి గంటపాటు 8, 9, 10 తరగతులకు బోధన సప్తగిరి ఛానల్‌ ద్వారా జరుగుతుంది. ప్రతి విద్యార్థీ తప్పనిసరిగా వీక్షించాలి.*



*🍁సందేహాల నివృత్తికి..*



*🔸నిర్ణీత షెడ్యూలు ప్రకారం ఈ నెల 16 నుంచి ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లాలి. 1-5 తరగతులు బోధించే వారు ప్రతి మంగళవారం, 6, 7 తరగతుల వారు బుధవారం, 8, 9, 10 తరగతులకు బోధన చేసే వారు బుధ, శుక్రవారాల్లో హాజరై విద్యార్థుల వద్ద నోట్‌, వర్క్‌ పుస్తకాలను పరిశీలించి అనుమానాలు తీర్చాలి. కాగా విద్యార్థులందరికీ బ్రిడ్జి కోర్సు సామగ్రి మంగళవారానికి అందజేయాల్సి వుండగా ఇంకా అన్ని మండలాలకు అందలేదు. విద్యార్థులు ఏ మేరకు టీవీలు అనుసరిస్తున్నారనేది పర్యవేక్షించాలని డీఈవో వీఎస్‌ సుబ్బారావు ఎంఈవోలను ఆదేశించారు.

No comments:

Post a Comment