Monday, June 15, 2020

ISRO CYBER SPACE COMPETITIONS -2020


ISRO CYBER SPACE COMPETITIONS -2020

‌ డిజిటల్‌ వేదికపై చిన్నారులకుwww.isro.gov.in/icc–2020 ఇస్రో పోటీల నిర్వహణ

పేర్ల నమోదుకు ఈ నెల 24 వరకు గడువు

చిన్నారుల్లోని సృజనను వెలికి తీసేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ఆన్‌లైన్‌, డిజిటల్‌ వేదికపై ప్రతిభా పోటీలు నిర్వహించేందుకు సిద్ధమైంది.

ఒకటి నుంచి ఇంటర్‌ విద్యార్థులందరూ ఇస్రో సైబర్‌ స్పేస్‌ కాంపిటేషన్స్‌-2020 పోటీల్లో పాల్గొనవచ్చు.

ఇంట్లో నుంచే కూర్చున్నచోటు నుంచి కదలకుండా పోటీలో పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు.

ఒక విద్యార్థి ఒక పోటీలోనే పాల్గొనేందుకు షరతు విధించారు. 2020-21 విద్యా సంవత్సరంలో చదివే తరగతులకు అనుగుణంగా పోటీ ఉంటుంది.

2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాల జారీ చేసిన గుర్తింపు కార్డుతో పోటీలో పాల్గొనవచ్చు.

ఒకటో తరగతి నుంచి మూడో తరగతి విద్యార్థులకు చిత్రలేఖనం
4 నుంచి 8 తరగతుల విద్యార్థులకు మోడల్‌ మేకింగ్‌(సైన్సు క్రాఫ్ట్‌)
9, 10 తరగతుల విద్యార్థులకు వ్యాసరచన పోటీ, ఇంటర్‌ విద్యార్థులకు అంతరిక్షంపై క్విజ్‌ పోటీలు నిర్వహిస్తారు.

పోటీల సిలబస్‌ వెబ్‌సైట్‌ ద్వారా త్వరలో వెల్లడిస్తారు.

వివరాల నమోదుకు ఈ నెల 24 వరకు గడువు ఉంది.

ఆసక్తి కలిగిన విద్యార్థులు www.isro.gov.in/icc–2020 వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

 ప్రతిభావంతులైన 500 మంది విద్యార్థులకు మెరిట్‌ ధ్రువపత్రాల్ని పోస్టు లేదా ఈ-మెయిల్‌ ద్వారా అందజేస్తారు.

పోటీలో పాల్గొన్న విద్యార్థులందరికీ ప్రాతినిధ్య ధ్రువీకరణ పత్రం ఈ-మెయిల్‌ ద్వారా అందిస్తారు.

మరిన్ని వివరాలకు 080-23515850 నెంబరు లేదా icc–2020@isro.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించాలి. ఇస్రో నిర్వహించే పోటీలో ఎక్కువమంది విద్యార్థులు పాల్గొని సృజనాత్మకత చాటాలని జిల్లా సైన్సు అధికారి మధుకుమార్‌ ‘న్యూస్‌టుడే’తో పేర్కొన్నారు.

No comments:

Post a Comment