Thursday, June 11, 2020

E-SR నమోదులో సమస్యలెన్నో...



♦ఇ-ఎస్‌ఆర్‌ నమోదులో సమస్యలెన్నో!

🔸పారదర్శకతకు పెద్దపీట వేసే క్రమంలో ప్రభుత్వం సాంకేతికతను అన్నింటిలోనూ అమలు చేస్తోంది.

🔹ఉద్యోగుల సర్వీసు రిజిస్టర్‌ (ఎస్‌ఆర్‌)ను ఆన్‌లైన్‌ చేయాలని గత ప్రభుత్వం 2018లో ఇ-ఎస్‌ఆర్‌ నమోదు ప్రక్రియను ప్రారంభించింది.. రెండేళ్లుగా నమోదు అంతంత మాత్రంగానే జరిగింది

🔸ప్రస్తుతం మూడు శాఖల ఉద్యోగులు పైలెట్‌ ప్రాజెక్టుగా నమోదు చేసుకోవాలని ఆదేశాలు వచ్చాయి. అందులో ఉపాధ్యాయులు ఉన్నారు. వారం రోజులుగా ఇందులో నిమగ్నమైన ఉపాధ్యాయులకు చుక్కలు కనిపిస్తున్నాయి.

 🔹ఈనెల 30తో నమోదుకు గడువు విధించటంతో అంతర్జాల కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు.

 🔸ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఉద్యోగ విరమణ అనంతరం సైతం ఎస్‌ఆర్‌ అవసరం ఉంటుంది.

🔹విద్యార్హతలు, శాఖాపరమైన పరీక్షలు, వార్షిక ప్రోత్సాహకాలు, వేతన శ్రేణులు, సెలవుల వివరాలు, పొదుపు ఖాతాల నంబర్లు, పెంపుదల నమోదు, పీఆర్సీ  ఫిట్‌మెంట్‌, నామినీ వివరాలు తదితరాలు పూర్తిగా నమోదు చేయాలి.

 🔹ఉద్యోగోన్నతి, విరమణ సమయానికి రావలసిన ప్రయోజనాలకు సేవా పుస్తకం తప్పనిసరి.

🍁ఎదురవుతున్న సమస్యలు

పార్ట్‌-1లో ఖాతా వివరాల్లో పీఎఫ్‌ నిమిత్తం జిల్లా, చేరిన తేదీ, 31 మార్చి 2019న బ్యాలెన్స్‌ నమోదు చేసిన తర్వాత సేవ్‌ సక్సెస్‌ఫుల్‌ అని చూపి తర్వాత ఖాళీగా చూపుతుంది.

🎯పార్ట్‌-2లో నామినీగా ఇతరులను సోదరి, సోదరుడిని చూపినా.. పుట్టిన తేదీ, ఉద్యోగి చేరిన తేదీకి ముందు లాక్‌ అవుతోంది.

🎯పార్ట్‌-3లో ఈవెంట్‌లో ఛేంజ్‌ ఇన్‌పేలో అప్రెంటీస్‌లోని రూ.1200, రూ.1500 చూపడానికి వీలు లేదు.

🎯సస్పెండైన ఉద్యోగులు బాధ్యతలు తీసుకున్నా వారి సమాచారం చూపడం లేదు.
🎯ఈఎల్‌ సరెండర్‌ చేసిన వివరాలు ఉన్నాయి. వేసవి సెలవుల్లో పొందిన ఈఎల్‌లు నమోదు చేయడానికి ఐచ్ఛికం లేదు. ఏడాదికి వచ్చే ఆరు ఈఎల్‌లు నమోదుకు ఐచ్ఛికం లేదు.

🎯ఉద్యోగంలో చేరే ముందురోజు తీసుకున్న వైద్య ధ్రువీకరణ పత్రాలు ప్రస్తుతం ఎవరి వద్దా లేవు. పోలీసు వెరిఫికేషను వివరాలు డీఈవో కార్యాలయానికి అందజేస్తారు తప్ప ఉపాధ్యాయులకు ఇవ్వరు. ఆ వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయలేకపోతున్నారు.



0 comments:


Post a comment



Top

No comments:

Post a Comment